'దూకుడు'గా వ్యవహరిస్తున్న శ్రీనువైట్ల..మహేష్ తో మరోసారి..!

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస ప్లాపులతో సతమతమవుతున్న సమయంలో విడుదల అయినా సినిమా దూకుడు.ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే సూపర్ హిట్ అయినా సినిమా.

 Srinu Vaitla Again Movie With Super Star Mahesh Babu-TeluguStop.com

ఆయన కెరీర్ ను ఒక్కసారిగా ఉపందుకునేలా ఈ సినిమా చేసింది.అయితే దూకుడు సినిమా వచ్చి ఈ రోజుకు కరెక్ట్ గా పది సంవత్సరాలు అవుతుంది.

ఆ సమయంలోనే ఈ సినిమా రికార్డ్ స్థాయి కలెక్షన్లను సాధించింది.

 Srinu Vaitla Again Movie With Super Star Mahesh Babu-దూకుడు’గా వ్యవహరిస్తున్న శ్రీనువైట్ల..మహేష్ తో మరోసారి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాను టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించాడు.

ఇప్పటికి ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.ఈ సినిమాలో మహేష్ కొత్తగా కనిపించదు.

ఇంతకు ముందు సినిమాల్లో లేని టైమింగ్, కామెడీ సెన్స్ మొత్తం కూడా ప్రేక్షకులను బాగా అలరించాయి.ఇక ఈ సినిమా విడుదల అయ్యి దశాబ్దం అవుతున్న సందర్భంగా మహేష్ అభిమానులు దూకుడు హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఈ సినిమా పెద్ద హిట్ అవవడంతో ఆ తర్వాత కూడా మహేష్ బాబు శ్రీను వైట్లకు మరొక ఛాన్స్ ఇచ్చాడు.అయితే ఈసారి మాత్రం శ్రీను వైట్ల మహేష్ కు అట్టర్ ప్లాప్ సినిమాను చేతిలో పెట్టాడు.ఆగడు సినిమా మహేష్ కెరీర్ లో మరొక డిజాస్టర్ గా నిలిచింది.ఇక ఆ తర్వాత శ్రీను వైట్ల చేసిన సినిమాలు కూడా వరుస ప్లాప్ అవుతున్నాయి.

అన్ని సినిమాలు అదే జానర్ లో తెరకెక్కించడం వల్ల సినిమాలు ప్లాప్ అవుతున్నాయని స్వయంగా వైట్ల నే ఒప్పుకున్నాడు.

అయితే శ్రీను వైట్ల మహేష్ బాబు తో మరొకసారి సినిమా చేయాలనీ అనుకుంటున్నాడట.ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నాడట.ఆ స్క్రిప్ట్ శ్రీను వైట్లకు బాగా నచ్చిన తర్వాతనే మహేష్ కు వినిపిస్తాడట.

ఈసారి మహేష్ శ్రీను వైట్ల సినిమాను ఒప్పుకుంటాడో లేదో చూడాలి.ఇక ప్రెసెంట్ శ్రీను వైట్ల మంచు విష్ణు తో ఢీ సినిమా సీక్వెల్ చేస్తున్నాడు.

ఈ సినిమా ఢీ అంటే ఢీ అనే టైటిల్ కూడా అనౌన్స్ చేసాడు.చూడాలి మరి శ్రీను వైట్ల తన స్క్రిప్ట్ తో మహేష్ ను ఒప్పిస్తాడో లేదో.

https://twitter.com/SreenuVaitla/status/1440864470562074628?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1440864470562074628%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fntvtelugu.com%2Fdookudu-combo-repeat-again%2F
#SrinuVaitla #Srinu Vaitla #Dookudu #Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు