నితిన్, రాశి ఖన్నా జంటగా నటించిన శ్రీనివాస కళ్యాణం హిట్టా.? స్టోరీ, రివ్యూ..రేటింగ్ తెలుగులో.!  

Movie Title; శ్రీనివాస కళ్యాణం

Cast & Crew:
న‌టీన‌టులు: నితిన్, రాశీఖ‌న్నా, నందితా శ్వేత‌, ప్ర‌కాశ్ రాజ్, జ‌య‌సుధ‌, న‌రేశ్ త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం: స‌తీష్ వేగేశ్న‌
నిర్మాత‌: దిల్ రాజు
సంగీతం: మిక్కీ జే మేయ‌ర్

Srinivasa Kalyanam Movie Review-

Srinivasa Kalyanam Movie Review

STORY:

వాసు (నితిన్) చండీగఢ్ లో డిజైనర్ గా పని చేస్తుంటాడు. మరికొంత మంది తెలుగు ఉద్యోగులతో రూమ్ లో ఉంటాడు వాసు. అదే ఇంట్లో అద్దెకు దిగుతుంది రాశి ఖన్నా. రాశి ఖన్నా తండ్రి ఆర్.కె (ప్రకాష్ రాజ్) కోటీశ్వరుడు. మనుషులకంటే వస్తువులకే ఎక్కువ విలువను ఇస్తాడు. వాసు తల్లితండ్రులు మాత్రం పూర్తి భిన్నంగా ఉంటారు. మనుషులకి, బందాలకి విలువని ఇస్తారు. కూతురిని ప్రేమించిన విషయం చెప్పడానికి వాసు ఆర్.కె ని కాలుస్తాడు. అతను ఒప్పుకుంటాడు. నిశ్చితార్థం జరుగుతుంది. పెళ్లి సంబరాల్లో భార్య భర్తల సంబంధం గురించి మాట్లాడుతూ ఈ సినిమా ముగుస్తుంది.

Srinivasa Kalyanam Movie Review-

REVIEW:

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నితిన్ హీరోగా, రాశీ ఖ‌న్నా, నందితా శ్వేత హీరోయిన్లుగా నటించిన ‘శ్రీనివాస క‌ళ్యాణం’ ముందునుండి హిట్ టాక్ సంపాదించింది. శతమానం భవతి సినిమాతో హిట్ కొట్టిన స‌తీశ్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వం వహించడం, దిల్ రాజు-నితిన్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.ఫస్టాఫ్ ఓకే అని, సెకండాఫ్ బాగుందని చెబుతున్నారు. ఇదో ఫీల్ గుడ్ మూవీ అని, సాంగ్స్ బాగున్నాయని టాక్. భారీ తారాగణం ఆకట్టుకుంటుందని, డైలాగులు బాగున్నాయని తెలుస్తోంది. అక్కడక్కడా చిన్న మైనస్‌లు తప్పితే ఓవరాల్‌గా సినిమా బాగుందని చెబుతున్నారు ఈ సినిమా చుసిన వారు. కాకపోతే చిన్న చిన్న పాత్రలకు కూడా స్టార్ కాస్ట్ ని తీసుకున్నారు. సినిమాలో ట్విస్టులు పెద్దగా ఏం లేవు. కథ కూడా రొటీన్ గా ఉంది. సాంగ్స్ పర్లేదు.

Plus points:

ఫీల్ గుడ్
ఫామిలీ ఎంటర్టైనర్
స్టార్ కాస్ట్
తెలుగు సంప్రదాయం
డైలాగ్స్
సాంగ్స్
నితిన్, రాశి ఖన్నా లుక్

Minus points:

కథలోని మెయిన్ పాయింట్ లో లాజిక్ లేదు
యూత్ కి నచ్చే అంశాలు లేవు
కొన్ని అర్ధం లేని సన్నివేశాలు

Final Verdict:

పెళ్లి గొప్పతనాన్ని తెలియచేసే “శ్రీనివాస కళ్యాణం” యావరేజ్ సినిమా. పెద్దలకు నచ్చుతుంది…యూత్ కి నచ్చటం కష్టమే!

Rating: 2.75