హుస్సేన్ బోల్ట్ ను తలదన్నేలా వారంలోనే మరో రికార్డు సాధించిన శ్రీనివాస గౌడ..!

కంబాళ పోటీల్లో శ్రీనివాస గౌడ మరోక సరికొత్త రికార్డు సృష్టించాడు.భారత ఉసేన్ బోల్ట్ గా పేరు గాంచిన శ్రీనివాస గౌడ 100 మీటర్ల దూరాన్ని కేవలం 8.78 సెకన్లలో చేరుకొని సరికొత్త రికార్డు సృష్టించాడు.దీంతో అతడిపై దేశవ్యాప్తంగా ప్రజలు అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 Srinivasa Gowda Breaks Usain Bolt Record In Kambala , Srinivasa Gowda, Breaks, H-TeluguStop.com

శ్రీనివాస గౌడ భారత ఉసేన్ బోల్ట్ గా పేరు సంపాదించాడు.గత ఏడాది కర్ణాటకలో నిర్వహించిన కంబాళ పోటీల్లో ఎద్దుల వెంట అతడు బురద నీటిలో మెరుపు వేగంతో పరుగెత్తడం చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది.

కర్ణాటక రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కంబాళ పోటీలు సాంప్రదాయబద్దంగా చేయడంతో పాటు అక్కడ వ్యవసాయం చేసే గౌడ సామాజిక వర్గానికి చెందిన వారితో మాత్రమే ఈ పోటీలు నిర్వహిస్తుండడం విశేషం అనే చెప్పాలి.

కంబాళ ఆట అనేది కర్ణాటకలోని దక్షిణ కన్నడ ఉడిపి తుళునాడు తీరప్రాంతాల్లో నిర్వహించే ఒక సాంప్రదాయ క్రీడ.

ఈ ఆట యొక్క సారాంశం ఏంటంటే పోటీలో పాల్గొనే వ్యక్తి ఎద్దులను రెచ్చగొడుతూ బురద నీటిలో పరుగెత్తాల్సి ఉంటుంది అన్నమాట.ఈ క్రమంలో ఆదివారం రోజున కర్ణాటకలోని బంత్వాల్ తాలూకా పరిధిలో ఈ పోటీని 100 మీటర్లకు లెక్కకడితే శ్రీనివాస గౌడ కేవలం 8.78 సెకండ్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు అధికారులు నిర్ధారించారు.

Telugu Meters Race, Seconds, Breaks, Hussein Bolts, Karnataka, Olym, India, Srin

గతవారం వెళ్తాంగండిలో నిర్వహించిన ఈ పోటీల్లో ఎనిమిది మీటర్ల రేసును 8.96 సెకండ్లలో పూర్తిచేసిన శ్రీనివాస గౌడ.తాజాగా నిర్వహించిన పోటీల్లో అంతకుముందు రికార్డును బ్రేక్ చేసాడు.

ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ ప్రతిభను గుర్తించి అతనికి మరింత శిక్షణ ఇచ్చి ఒలంపిక్స్ లో పరుగు పందెం పోటీలకు పంపడానికి సాయ్ ( స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ముందుకు వచ్చింది.అయితే సాయ్ ఆఫర్ ను శ్రీనివాస గౌడ సున్నితంగా తిరస్కరించాడు.

కేవలం కర్ణాటకలో నిర్వహించే కంబళా పోటీల్లో మాత్రమే పాల్గొంటున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube