సినిమాకే కాదు, టైటిల్‌కూ న్యాయం జరగలేదు

ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో నరేష్‌, ఆమనిలు హీరో హీరోయిన్స్‌గా బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అలీ ఇంకా పలువురు ప్రముఖ కమెడియన్స్‌ నటించిన చిత్రం ‘జంబ లకిడి పంబ’.అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఆ చిత్రం, తెలుగు సినిమా చరిత్రలో క్లాసిక్‌గా మిగిలి పోయింది.

 Srinivas Reddy Jambalakidi Pamba Disaster Talk-TeluguStop.com

ఇప్పటికి కూడా ఆ సినిమా టీవీల్లో వస్తూ ఉంటే ప్రేక్షకులు టీవీలకు అతుక్కు పోతారు.ఈ తరం వారికి కూడా బాగా నచ్చిన ‘జంబలకిడి పంబ’ చిత్రంను తాజాగా అదే టైటిల్‌తో రీమిక్స్‌ చేసేందుకు శ్రీనివాస రెడ్డి ప్రయత్నాలు చేశాడు, ఆ ప్రయత్నం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది.

‘జంబ లకిడి పంబ’ చిత్రంను అల్లరి నరేష్‌తో సీక్వెల్‌ చేయడానికి లేదా రీమేక్‌ చేయడానికి చాలా మంది ప్రయత్నించారు.కాని అల్లరి నరేష్‌ తన తండ్రి తప్ప ఆ సబ్జెక్ట్‌కు ఇప్పుడు ఎవరు న్యాయం చేయలేరు అంటూ గట్టిగా నమ్మాడు.అందుకే రీమేక్‌కు లేదా సీక్వెల్‌కు ఆసక్తి చూపించలేదు.అల్లరి నరేష్‌ ఆసక్తిగా లేకపోవడంతో కమెడియన్‌ శ్రీనివాసరెడ్డి సీక్వెల్‌కు ముందు అడుగు వేశాడు.జంబ లకిడి పంబను ఎలా చేసినా ప్రేక్షకులు ఆధరిస్తారని భావించినట్లుగా ఉన్నారు.పెద్దగా కథ లేకుండానే అప్పటి స్టోరీ లైన్‌ను తీసుకుని ఈ చిత్రాన్ని చేయడం జరిగింది.

జంబ లకిడి పంబ అనే టైటిల్‌ను పెట్టుకున్నందుకు కనీసం అప్పటి సినిమాకు 25 శాతం అయినా న్యాయం చేయలేక పోయారు.పాత జంబ లకిడి పంబ చిత్రంలో ఈ చిత్రం కనీసం 25 శాతం అయిన లేదని ప్రేక్షకులు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఏమాత్రం ఆకట్టుకోని కథ, కథనం చాలా రొటీన్‌ కామెడీతో ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకోలేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఆ సినిమాకు రీమేక్‌ అంటూ క్లాస్‌ పరువు తీశారు అంటూ ఈవీవీ సత్యనారాయణ అభిమానులు మరియు కుటుంబ సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని సినిమాలను ముట్టుకుంటే మాడిపోవడా ఖాయం అని గతంలో వెళ్లడైంది.తాజాగా ఈవీవీ సత్యనారాయణకు ఎంతో పేరు తెచ్చి పెట్టిన ఈ చిత్రంను ముట్టుకున్నందుకు శ్రీనివాసరెడ్డి కెరీర్‌ ప్రస్తుతం ప్రమాదంలో పడ్డట్లయ్యింది.

కమెడియన్‌గా మంచి ఆఫర్లు దక్కించుకుంటున్న శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఇలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు హీరోగా రావడంతో కమెడియన్‌గా కూడా అవకాశాలు కష్టం అవుతాయనే సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube