Movie Title (చిత్రం): జంబలకడి పంబ
Cast & Crew:
నటీనటులు: శ్రీనివాస్ రెడ్డి, సిద్ది ఇదాని, వెన్నెల కిషోర్ తదితరులు దర్శకత్వం: జె.బి.మురళి కృష్ణ సంగీతం: గోపి సుందర్ నిర్మాత: జోజో జోస్
Story:
వరుణ్ (శ్రీనివాస్ రెడ్డి), పల్లవి (సిద్ది) ల జంటను పరిచయం చేస్తూ సినిమా మొదలవుతుంది.వరుణ్ సాఫ్ట్ వెర్ ఇంజనీర్ గా చేస్తుంటాడు.పల్లవి ఫాషన్ డిజైనర్.పెళ్ళైన కొద్దిరోజులకే వారి మధ్య గొడవలు మొదలవుతాయి.విడాకులకు హరి (పోసాని) అనే లాయర్ ను కలుస్తారు.ఇంతలో సడన్ గా హరి చనిపోతారు.
కానీ ట్విస్ట్ ఎదురయ్యినట్టు ఓ స్పెషల్ పని మీద స్వర్గం నుండి మళ్లీ భూమి మీదకి వస్తారు హరి.ఆ స్పెషల్ పని ఏంటి అంటే పల్లవి, వరుణ్ లను కలపడం.జంబలకడి పంబ సినిమాలో లాగ వరుణ్ ని ఆడవారిలాగా, పల్లవిని మగవారిలాగా మారుస్తాడు హరి.చివరికి వారిద్దరూ ఎలా కలిశారు అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
Review:
జంబ లకడి సినిమా కాన్సెప్ట్ తోనే మరోసారి డైరెక్టర్ ముందుకి వచ్చారు.ఫస్ట్ హాఫ్ అంతగా ఆకట్టుకోలేదు.
సెకండ్ హాఫ్ లో కామెడీ సీన్స్ బాగున్నాయి.మొదటి సినిమా అయినా హీరోయిన్ బాగా చేసింది.
లేడి లాగ శ్రీనివాస్ రెడ్డి యాక్టింగ్ సూపర్.వెన్నెల కిషోర్ కామెడీ కూడా ఆకట్టుకుంది.
కానీ సినిమా బోరింగ్ గా సాగుతుంది.సినిమాలో పోసాని క్యారెక్టర్ కూడా బలంగా ఉంది.
కామెడీ సినిమా లాగ తీద్దాం అనుకున్నారు కానీ ఫెయిల్ అయ్యారు .
Plus Points:
శ్రీనివాస్ రెడ్డి యాక్టింగ్ వెన్నెల కిషోర్ కామెడీ పోసాని రోల్ సెకండ్ హాఫ్
Minus Points:
ఫస్ట్ హాఫ్ బోరింగ్ సన్నివేశాలు
Final Verdict:
ఏదో తీద్దాం అనుకున్నారు…కానీ సినిమా ఇంకేదో రకంగా వచ్చింది.చూడకపోవడమే బెటర్.