లేటెస్ట్ బజ్ : సలార్ స్పెషల్ సాంగ్ లో కేజిఎఫ్ బ్యూటీ !

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పేరు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ప్రపంచవ్యాప్తంగా మారు మోగిపోతుంది.బాహుబలి చిత్రం ద్వారా తన స్టామినా పెంచుకుని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని పైన నిలబెట్టాడు.

 Srinidhi Shetty In Salaar Special Song-TeluguStop.com

ఈ సినిమా తర్వాత వరస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు.ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.

అందులో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న సలార్ సినిమా ఒకటి.ఈ సినిమాను ఉగ్రం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.సలార్ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికం గా ప్రకటించారు.హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

 Srinidhi Shetty In Salaar Special Song-లేటెస్ట్ బజ్ : సలార్ స్పెషల్ సాంగ్ లో కేజిఎఫ్ బ్యూటీ -Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్ 14 న విడుదల కానుంది.

ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

ఈ సినిమాను ప్రశాంత్ నీల్ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని వార్తలు ప్రచారం అయ్యాయి.

అంతే కాదు ఆ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ సెలెక్ట్ అయిందంటూ వార్తలు వచ్చాయి.అయితే తాజాగా మరొక బ్యూటీ పేరు వినిపిస్తుంది.

Telugu #salaar, Prabhas, Shruti Haasan, Special Song, Srinidhi Shetty, Srinidhi Shetty In Salaar Special Song-Latest News - Telugu

ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కేజిఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి నర్తించబోతుందని ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ వార్త హల్ చల్ చేస్తుంది.మరి ఈ వార్తలో నిజమెంతో తెలియా లంటే మరి కొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ గాసిప్స్ అయితే ఆగవు.ప్రభాస్ ఈ సినిమాతో పాటు రాధే శ్యామ్, ఆది పురుష్ సినిమాలు కూడా చేస్తున్నాడు.

#Srinidhi Shetty #Shruti Haasan #SrinidhiShetty #Prabhas #Special Song

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు