లవ్ స్టోరీ గుట్టు విప్పిన శ్రీముఖి.. జీవితంలో అదే పెద్ద తప్పు అంటూ?

బుల్లితెర యాంకర్ గ్లామర్ బ్యూటీ శ్రీముఖి పరిచయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.బుల్లితెరలో ఎన్నో షో లలో యాంకరింగ్ చేసి మంచి క్రేజ్ అందుకుంది.

 Srimukhi , Instagram , Love Story , Social Media,netizens Comments,anchor Srimuk-TeluguStop.com

ఇక తన అందంతో గ్లామర్ విందుని వడ్డిస్తుంది.వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.

కానీ బుల్లితెరపైనే మంచి సక్సెస్ అందుకుంది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.

శ్రీముఖికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Telugu Love Story, Netizens, Srimukhi-Movie

యాంకర్ రవితో కలిసి పటాస్ షోలో యాంకరింగ్ చేసి.అసలైన క్రేజ్ అక్కడి నుండే అందుకుంది.అంతేకాకుండా బిగ్ బాస్ రియాలిటీ షో లో కూడా పాల్గొని చివరి వరకు గేమ్ లో ఆడి రన్నరప్ గా నిలిచింది.

ఇక ఖాళీ సమయం దొరికితే చాలు ఫ్రెండ్స్ తో తెగ ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటుంది.వారితో కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.అంతేకాకుండా తన గ్యాంగ్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా బాగా షేర్ చేస్తుంటుంది.

ఇక ఈ మధ్య శ్రీముఖి సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉండటంతో అభిమానులతో తెగ ముచ్చట్లుపెడుతుంది.

ఫన్నీ వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.ఇటీవల శేఖర్ మాస్టర్ తో కలిసి డాన్స్ చేస్తూ బాగా రెచ్చిపోయింది.

అంతేకాకుండా పొట్టి పొట్టి బట్టలతో యువతను కన్నార్పకుండా చేస్తుంది శ్రీముఖి.ఇదిలా ఉంటే మళ్లీ తన లవ్ స్టోరీ గురించి అసలు విషయం బయట పెట్టింది.

Telugu Love Story, Netizens, Srimukhi-Movie

తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టింది.ఇక వాళ్లంతా రకరకాల ప్రశ్నలను ప్రశ్నించగా వెంటనే స్పందించింది.ఇదిలా ఉంటే ఓ నెటిజన్ మీ జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఏది అని ప్రశ్నించగా.వెంటనే శ్రీముఖి.జనాలను త్వరగా నమ్మడం, ప్రేమించడం అంటూ తెలిపింది.ఇక మరో నెటిజన్ జీవితంలో ప్రేమ కథలు ఉన్నాయా అని ప్రశ్నించగా అద్భుతమైనవి ఉన్నాయి అంటూ స్పందించింది.

గతంలో బిగ్ బాస్ లో ఒకరిని ఇష్టపడ్డానని కానీ అది బ్రేకప్ అవడంతో ఎంతో బాధపడ్డానని తెలిపిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube