అందరి ముందు డాక్టర్ బాబును గట్టిగా హగ్ చేసుకున్న శ్రీముఖి.. మరీ ఇంతా అవసరమా అంటూ ట్రోల్స్?

బుల్లితెరపై స్ట్రాంగ్ అండ్ ఎనర్జిటిక్ ఫిమేల్ యాంకర్ గా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్న గ్లామర్ బ్యూటీ శ్రీముఖి.ఈమె పరిచయం గురించి టాలీవుడ్ ప్రేక్షకులందరికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Srimukhi Hugged Dr Babu In Front Of Everyone Trolls Saying Is It Necessary, Srim-TeluguStop.com

తన గల గల మాటలతో, అల్లర్లతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొని అభిమానులుగా మార్చుకుంది.ఎన్నో షోలలో యాంకరింగ్ చేసి తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి అక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంది.ఎంత బిజీ లైఫ్లో ఉన్న కూడా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది.

శ్రీముఖి తొలిసారిగా అదుర్స్ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.ఇందులో మంచి పేరు సంపాదించుకోవడంతో ఆ తర్వాత పటాస్ షోలో యాంకరింగ్ చేసి బాగా ఆకట్టుకుంది.

అలా ఆ తర్వాత ఎన్నో షోలలో యాంకరింగ్ చేసింది.శ్రీముఖి తన యాక్టివిటీతో ఎనర్జిటిక్ యాంకర్ అని పేరు కూడా సంపాదించుకుంది.అంతేకాకుండా బుల్లితెర ప్రేక్షకులు ఈమెను ముద్దుగా బుల్లితెర రాములమ్మ అని పిలుస్తూ ఉంటారు.ఏ షోలో నైనా శ్రీముఖి చేసే అల్లరి మాత్రం అంతా ఇంతా కాదనే చెప్పాలి.

ఇక రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం అందుకొని మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది.చివరి వరకు ఆటలో కొనసాగి రన్నరప్ గా నిలిచింది.ఇక బిగ్ బాస్ తర్వాత వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.తన యాంకరింగ్ జీవితాన్ని కూడా యధావిధిగా కొనసాగిస్తుంది.

ఇక రోజు రోజుకి శ్రీముఖి డిమాండ్ బాగా పెరిగిపోతుందనే చెప్పాలి.ఇప్పుడు ఏ ఛానల్ లో చూసిన శ్రీముఖినే కనిపిస్తుంది.

దీంతో ఆమె ఎనర్జీని చూసి చాలా మంది షాక్ అవుతున్నారు.అంత బిజీగా ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఏదోక పోస్ట్ తో శ్రీముఖి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

ప్రతిసారి తన హాట్ ఫోటోలను, ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.

అంతేకాకుండా పొట్టి పొట్టి డ్రెస్సులు ధరించి డాన్స్ లు చేస్తుంది.ఇక తన డాన్స్ వీడియో లను షేర్ చేస్తూ కుర్రాళ్లను ఫిదా చేస్తుంది.ఇదంతా పక్కన పెడితే శ్రీముఖి బాగా దూకుడుగా కనిపిస్తూ ఉంటుంది.

ఎవరైనా హీరోలు కనిపిస్తే చాలు వెంటనే వాళ్ళను హగ్ చేసుకుంటుంది.గతంలో శేఖర్ మాస్టర్ తో డాన్స్ చేస్తూ ముద్దు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అయితే తాజాగా కూడా అలాగే రెచ్చిపోయింది శ్రీముఖి.అసలు విషయం ఏంటంటే తాజాగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో కార్తీకదీపం సీరియల్ త్వరలో శుభం కార్డు పలకడానికి సిద్ధంగా ఉండగా ఫేర్వెల్ పార్టీగా ఈవెంట్ ను చేయగా అందులో వేదిక మీదకి డాక్టర్ బాబు, వంటలక్క వచ్చి సందడి చేసినట్లు కనిపించారు.

ఇక వంటలక్క నేను లేనిది చూసి లైన్ వేస్తున్నావ్ అంటా అంటూ డాక్టర్ బాబు ని అడగటంతో.వెంటనే శ్రీముఖి నన్నయితే హగ్ చేసుకున్నాడు అని డాక్టర్ బాబును పట్టుకుంది.

ఇక డాక్టర్ బాబు కూడా ఇలా కాదు కదా ఇలా అంటూ ఆయన కూడా గట్టిగా హగ్ చేసుకున్నాడు.దీంతో ఈ ప్రోమో చూసిన వాళ్లంతా శ్రీముఖి ని ఇంత అవసరమా అంటూ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube