'పటాస్‌'కు శ్రీముఖి గుడ్‌ బై చెప్పడానికి కారణం ఇదే.. 4 రోజులకు బయటకు వచ్చిన అసలు విషయం  

Srimukhi Good Bye In Patas-

బుల్లి తెరపై అనసూయ, రష్మి స్థాయిలో కాకున్నా ఆ రేంజ్‌లో శ్రీముఖి పటాస్‌ షోతో దున్నేస్తున్న విషయం తెల్సిందే.రవితో కలిసి శ్రీముఖి పటాస్‌ ప్రారంభం నుండి కూడా చేస్తూ వచ్చింది.పటాస్‌ కారణంగా శ్రీముఖి సక్సెస్‌ గ్రాఫ్‌ ఎక్కడికో వెళ్లింది...

Srimukhi Good Bye In Patas--Srimukhi Good Bye In Patas-

శ్రీముఖికి సినిమాల్లో కూడా ఆఫర్లు వచ్చాయి.పటాస్‌ రాములమ్మ అంటూ శ్రీముఖిని అంతా కూడా గుర్తు పడతారు.అలాగే శ్రీముఖి కూడా తనకు ఇంతటి గుర్తింపును తెచ్చి పెట్టింది పటాస్‌ అంటూ ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

అలాంటి పటాస్‌ను తాను వదిలేయబోతున్నట్లుగా ఇటీవల శ్రీముఖి స్వయంగా ప్రకటించిన విషయం తెల్సిందే.

Srimukhi Good Bye In Patas--Srimukhi Good Bye In Patas-

ఆమె వీడియో విడుదల చేయకుంటే పెద్దగా పట్టించుకునే వారు కాదేమో, మీడియాలో వార్తలు వస్తే అవి పుకార్లు అనుకునేవారు.కాని ఈసారి మాత్రం ఆమె స్వయంగా వీడియోను విడుదల చేయడం వల్ల మరే అనుమానం లేకుండా శ్రీముఖి పటాస్‌కు గుడ్‌ బై చెప్పేసిందని క్లారిటీ వచ్చేసింది.

అయితే శ్రీముఖి తాను ఎందుకు పటాస్‌కు బ్రేక్‌ తీసుకుంటుందో అనే విషయాన్ని మాత్రం క్లారిటీగా చెప్పలేదు.శ్రీముఖి పటాస్‌కు రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని చాలా మంది భావిస్తున్నారు.కాని కొందరు మాత్రం మళ్లీ శ్రీముఖిని పటాస్‌లో చూడలేం అంటూ చెబుతున్నారు.

తాజాగా శ్రీముఖి గురించిన అసలు విషయం బయటకు వచ్చింది.ఒక పెద్ద సినిమాలో ఆఫర్‌ వచ్చిందని, అందుకోసం బరువు తగ్గడంతో పాటు, సినిమాకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉందని, అందుకే తాత్కాలికంగా పటాస్‌కు బ్రేక్‌ తీసుకుందని అంటున్నారు.ఈ విషయం ఆమె సన్నిహితుల ద్వారా సినీ వర్గాల్లో ప్రచారం అవుతుంది.ఇక మరి కొందరు మాత్రం పటాస్‌లో ఇతరులతో ఉన్న విభేదాల కారణంగా శ్రీముఖి గుడ్‌ బై చెప్పి ఉంటుందని అంటున్నారు.

యాదమ రాజు అండ్‌ టీంను పటాస్‌ నుండి తొలగించిన కారణంగానే ఆమె తప్పుకుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.అయితే ప్రధానంగా మాత్రం ఆమె సినిమా ఛాన్స్‌ కారణంగా పటాస్‌కు బై బై చెప్పిందని అంటున్నారు.అసలు విషయం ఏంటీ అనేది ఆమె త్వరలో చెబుతుందేమో చూడాలి...