ఆ ముగ్గురు ‘క్రేజీ అంకుల్స్‌’ తో శ్రీముఖి చేయబోతున్నది ఏంటీ?  

srimukhi doing crazy uncles with mono raghu kunche rajaravindra Sri Mukhi, Bomma Adhirindhi, Mano, Raghu Kunche, Raja Ravindra, Bomma Adirindhi, Siva Nageswara Rao, Crazy Uncles, - Telugu ‘bomma Adhirindhi’, Bomma Adirindhi, Crazy Uncles, Mano, Raghu Kunche, Raja Ravindra, Siva Nageswara Rao, Sri Mukhi

బుల్లి తెర సెన్సేషన్ శ్రీముఖి ఇప్పటికే పలు సినిమాల్లో కూడా నటించి నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది.కాని ఈమద్య కాలంలో ఆమె సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నట్లుగా అనిపిస్తుంది.

TeluguStop.com - Srimukhi Doing Crazy Uncles With Mono Raghu Kunche Rajaravindra

ఎట్టకేలకు ఈమె ఒక సినిమాను చేసేందుకు సిద్దం అయినట్లుగా తెలుస్తోంది.త్వరలో ఈమె ఒక వెబ్‌ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ప్రముఖ ఓటీటీ శ్రేయాస్‌ ఈటీ వారి నిర్మాణంలో రూపొందబోతున్న క్రేజీ అంకుల్స్ అనే మూవీలో ఈమె కీలక పాత్రలో కనిపించబోతోంది.ఆ సినిమాలో అంకుల్స్‌ పాత్రల్లో ప్రముఖ గాయకుడు మనో, సంగీత దర్శకుడు రఘు కుంచే మరియు నటుడు రాజా రవీంద్ర లు నటించబోతున్నారు.

TeluguStop.com - ఆ ముగ్గురు క్రేజీ అంకుల్స్‌’ తో శ్రీముఖి చేయబోతున్నది ఏంటీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ ముగ్గురు అంకుల్స్ తో శ్రీముఖి చేసే సందడి ఈ క్రేజీ అంకుల్స్ సినిమాలో చూడవచ్చు.ఈ సినిమా చాలా విభిన్నంగా ఉంటుందంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించబోతున్న నేపథ్యంలో ఆసక్తి మరింత ఎక్కువగా ఉంది.ఈయన ఎక్కువగా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ సినిమాలను తెరకెక్కించాడు.

కనుక ఇది కూడా ఖచ్చితంగా ఒక మంచి కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని నమ్మకం అంతా వ్యక్తం చేస్తున్నారు.దసరా సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు.

లాంఛనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.బొమ్మ అదిరింది అంటూ జి తెలుగు ఛానల్ లో సందడి చేస్తున్న శ్రీముఖి మరో వైపు యూట్యూబ్ లోని తన వ్యక్తిగత ఛానెల్‌ లో కూడా తన వీడియోలతో హల్చల్ చేస్తుంది.

ఇప్పుడు క్రేజీ అంకుల్స్‌ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుందో చూడాలి. వెబ్‌ మూవీ అంటే కాస్త బోల్డ్ గా ఉంటుంది.

కనుక ఇది కూడా బోల్డ్ గా ఉంటుందని కొందరు భావిస్తున్నారు.మరి ప్రేక్షకులు ఈ బోల్డ్‌ మూవీని ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేది చూడాలి.

#Bomma Adirindhi #Raghu Kunche #Mano #Crazy Uncles #Sri Mukhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Srimukhi Doing Crazy Uncles With Mono Raghu Kunche Rajaravindra Related Telugu News,Photos/Pics,Images..