బిగ్‌బాస్ విన్నర్ కాదు.. శ్రీముఖి తమ్ముడి ఏం చెప్పాడో తెలుసా?

ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై టాప్ రియాలిటీ షోగా దూసుకుపోతున్న బిగ్ బాస్ సీజన్ 3 ముగింపు దశకు చేరుకుంది.అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్‌కు ఐదుగురు కంటెస్టెంట్లు చేరుకున్నారు.

 Srimukhi Brother Responds On Fake Bigg Boss Winner Pic-TeluguStop.com

దాదాపు 100 రోజులకు పైగా నిర్వహించిన ఈ షోలో ఫైనల్ విన్నర్ ఎవరో తెలిసిపోయిందంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో చక్కర్లు కొడుతోంది.

నాగార్జునను హత్తుకుని ఉన్న శ్రీముఖి ఫోటోతో ఆమెనే బిగ్ బాస్ 3 విన్నర్ అంటూ సోషల్ మీడియాలో ఫోటో వైరల్ అవుతోంది.

అయితే ఈ ఫోటోలో శ్రీముఖి చేతిలో బిగ్ బాస్ టైటిల్ బహుమతి కూడా ఉందండోయ్.దీంతో ఆ ఫోటోను శ్రీముఖి అభిమానులతో పాటు బిగ్ బాస్ ప్రేక్షకులు తెగ షేర్ చేస్తున్నారు.

కానీ అది నిజమైన ఫోటో కాదని.అది మార్ఫింగ్ చేసిన ఫోటో అని తేల్చి చెప్పేశాడు ఆమె సోదరుడు.

మార్ఫింగ్ ఫోటోతో శ్రీముఖి బిగ్‌బాస్ విజేతగా ప్రకటించడం సబబు కాదంటూ ఫ్యాన్స్‌కు శ్రీముఖి తమ్ముడు విజ్ఞప్తి చేస్తున్నాడు.బిగ్ బాస్ విన్నర్ ఎవరనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.

అంతవరకు అభిమానులు వేచి చూడాలని ఆయన కోరారు.ఇక ఆదివారం నాడు బిగ్ బాస్ 3 ఫైనల్ విన్నర్ ఎవరనేది నిర్వాహకులు తేల్చనున్నారు.

మరి ఈసారి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరవుతారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube