అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన అడల్ట్ కామెడీ చిత్రం “బాబు బాగా బీజీ” సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకోని “A” సర్టిఫికెట్ తో మే నెల 5వ తేదిన విడుదలకి సిద్ధంగా ఉంది.ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా, వెరైటీగా ఉన్న పోస్టర్లు కూడా సినిమాకి కావాల్సన హైప్ ని తీసుకొస్తున్నాయి.
అయితే మీరు గమనించారో లేదో, ఈ సినిమా పోస్టర్లలో అవసరాల పక్కన్న తేజస్వీ, సుప్రియ ఐసోలా, మిష్తి చక్రవర్తి మాత్రమే కనిపిస్తున్నారు.తేజస్వీ, సుప్రియ పోస్టర్ మీద కూడా స్కిన్ షోతో ఆసక్తి రేపుతుండగా, యాంకర్ శ్రీముఖి మాత్రం కంటికి కనిపించడం లేదు.
బాబు బాగా బీజీలో ఘాటు సన్నివేశాలు బాగానే ఉన్నా, తను మాత్రం గ్లామరస్ గా కనిపించనని శ్రీముఖి ఇప్పటికే క్లారిటి ఇచ్చింది.ఈ విషయం మీద యూనిట్ సభ్యులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసారట.
ఇలా సినిమాకి సంబంధించిన ఓ విషయాన్ని ముందే బయటపెట్టి ఆసక్తి తగ్గించినందుకు యూనిట్ సభ్యలు ఇప్పటికే గుస్సా అవుతోంటే, వారి బీపీని మరింతగా పెంచుతోంది శ్రీముఖి.
పోస్టర్స్ కోసం చేసిన ఫోటోషూట్ కి శ్రీముఖి రాలేదట.
డుమ్మా కొట్టేసింది.అందుకే ఆమె పోస్టర్స్ మీద కనిపించడం లేదు.
పోస్టర్స్ మీద ఈ యాంకర్ క్రేజుని వాడుకునే అవకాశం లేకుండాపోయింది.పోస్టర్స్ కోసం స్టిల్స్ కావాలి, వచ్చి ఫోటోషూట్ లో పాల్గొనమంటే, డేట్స్ లేవు అంటోందట.
అసలేం జరిగుతోందో? కొంపదీసి ఈ సినిమా చేసినందుకు శ్రీముఖి పశ్చాత్తాపంతో ఇలా యూనిట్ కి చుక్కలు చూపించట్లేదు కదా?
.