ఆరునెలల తరవాత శ్రీమంతుడు సంచలనాలు

ఒక డబ్బున్న కుర్రాడు ఒక ఊరు తల రాతని పూర్తిగా మార్చేసిన కథ తో తెలుగు సినిమా రికార్డులు తిరగరాసిన మహేష్ బాబు – తన శ్రీమంతుడు తో ఫామిలీ జనాల ఫాలోయింగ్ ని కూడా విపరీతంగా పెంచేసుకున్నాడు.ఈ సినిమా గత సంవత్సరం ఆగస్ట్ ఏడు న విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

 Srimanthudu Stamina After 6 Months-TeluguStop.com

మహేష్ బాబు కి కెరీర్ లో అతి పెద్ద కలక్షన్ లు తెచ్చిపెట్టడమే కాక ఆయనకంటూ అద్భుతమైన గుర్తింపుని ఇచ్చింది ఈ చిత్రం.విడుదల అయిన అన్ని చోట్లా ఈ సినిమా సందడి చేసింది అయితే ఆశ్చర్యకర విషయం ఏంటంటే రెండవ సారి విడుదల లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో జాగరణ చేసే వారికోసం పాత సినిమాలను అర్థరాత్రి షోలుగా వేసే సాంప్రదాయం చాలాకాలంగా కొనసాగుతూ వస్తోన్న విషయం తెలిసిందే.‘శ్రీమంతుడు’ సినిమాకు ఈ శివరాత్రికి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ కనిపించింది.

ముఖ్యంగా హైద్రాబాద్‌లో శివరాత్రి రోజున మొత్తం 27 షోలు ప్రదర్శితమైతే ఈ షోల ద్వారా మొత్తం 21 లక్షల రూపాయల వసూళ్ళు రావడం విశేషంగా చెప్పుకోవచ్చు.రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ శ్రీమంతుడు సినిమాకు మంచి డిమాండ్ కనిపించిందని చిత్ర వర్గాలు తెలిపాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube