మళ్ళి ఊపందుకున్న శ్రీమంతుడు

ఏ సినిమా అయినా కరెక్ట్ సీజన్లో పడాలి .అప్పుడే 10 రావాల్సిన చోట 12,13 వస్తాయి.

 Srimanthudu Speeding Again-TeluguStop.com

పోకిరి వేసవి సెలవుల్లో పడి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.దూకుడు,గబ్బర్ సింగ్,అత్తారింటికి దారేది సెలవుల వల్ల రావాల్సిన దాని కన్నా ఎక్కువ రాబట్టుకున్నాయి.

శ్రీమంతుడు అత్తారింటికి దారేది రికార్డ్స్ బ్రేక్ చేసినప్పటికీ, ఎక్కడో చిన్న అసంతృప్తి మహేష్ అభిమానుల్లో .ఇదే సినిమాకి సెలవులు దొరికుంటే మరింత బాగుండేదని.

నిజమే మరి, అసలే డబ్బులన్ని బాహుబలి మీద పెట్టారు ప్రేక్షకులు, ఆ హంగామా పూర్తి అవకుండానే వచ్చేసాడు మహేష్.సెలవులు లేవు, పైగా భారి వర్షాలు మొదలయ్యాయి తెలుగు రాష్ట్రాల్లో.

మహేష్ కాబట్టే ఈ రేంజ్ కలెక్షన్లు రాబట్టుకోగాలిగాడు , అదే తనకి సెలవులు దొరికుంటే .శ్రీమంతుడు ప్రతి శని ఆదివారాల్లో ఊపు అందుకుంది.ఇవాళ రాఖి కావడంతో ఈ రోజు కలెక్షన్లు మళ్ళి పెరిగేలా ఉన్నాయి.విడుదల అయి నాలుగు వారాలు అవుతున్నకుడా భారతీయ చిత్రాల్లో ఈ రోజు కలెక్షన్లలో కిక్-2 ని కూడా వెనక్కి నెట్టి మూడో స్థానంలో ట్రెండ్ అవుతోంది శ్రీమంతుడు.

అందులోను రెండు కొత్త సన్నివేశాలు జత చేసారుగా… అభిమానులు మళ్ళి ఓ రౌండ్ వేస్తున్నట్టు ఉన్నారు.ఇదే జోరు కొనసాగిస్తే 80 కోట్ల షేర్ వసూలు చేయొచ్చు శ్రీమంతుడు.

శ్రీమంతుడు గనక వేసవి సెలవుల్లో లేదా దసరా కి వచ్చుంటే 90-`100 కోట్ల షేర్ వసూలు చేసేదేమో !

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube