సూపర్ స్టార్ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.రెండు భారి ఫ్లాప్స్ తరువాత వచ్చిన బ్లాక్బస్టర్ వారి ఆనందానికి అవధులు లేకుండా చేసింది.
ఈ రోజుతో శ్రీమంతుడు 100 రోజులు పూర్తీ చేసుకుంది.శ్రీమంతుడు 9 డైరెక్ట్ సెంటర్లలో, 5 షిఫ్ట్ సెంటర్లలో, మొత్తంగా 15 సెంటర్లలో నేడు 100 రోజుల సంబరాలు జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా అన్నదానాలు, పండ్ల పంపిణీ, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసారు మహేష్ అభిమానులు.కొందరు వేళ్ళల్లో విరాళాలు సేకరించి అనాథ ఆశ్రమాలకు ఇచ్చారు.
అలాగే ఆ 15 సెంటర్లలో ఈ రోజు 100 రోజుల సంబారాలు జరుగుతాయి.మరీ ముఖ్యంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో ఈ రోజు రాత్రి షో కి అభిమానులు అంతా కలిసి చిందులేయనున్నారు.
శ్రీమంతుడు సినిమాతో పాటు మహేష్ హిట్ సినిమాల సీన్లు, పాటలు కుడా ఈ రోజు థియేటర్లో ప్రదర్శించనున్నారు.
వెర్రి, పైత్యం అని తిట్టుకుంటాం కాని, కొన్ని సార్లు అభిమానం మంచి పనులు కుడా చేయిస్తుంది.