టాలీవుడ్ లో ఏ హీరో శ్రీలీలను వదలడం లేదు గా ?

శ్రీలీల.పెళ్లి సందడి సీక్వెల్ సినిమా తో కె రాఘవేంద్ర రావు చేతుల మీదుగా తెలుగు తెరకు పరిచయం అయ్యింది.

 Srileela Upcoming Movies List Details, Srileela, Heroine Srileela, Srileela Movi-TeluguStop.com

ఏ ముహూర్తాన వచ్చిందో కానీ ఈ అమ్మడి అదృష్టం మాములుగా లేదు.మొదటి సినిమా పెద్దగా ఆడకపోయినా ఆమె నటనకు, డ్యాన్సులకు తెలుగు సినిమా ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

దాంతో ఆ అభిమానాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు మేకర్స్.పెళ్లి సందడి తర్వాత రవి తేజ తో ధమాకా చిత్రం లో ఇరగదీసే నటనతో ఆకట్టుకుంది.

ఈ చిత్రం తో పాటు కన్నడ లో మరొక రెండు సినిమాల్లో కూడా నటించింది.ధమాకా సినిమా విడుదల కు ముందే మరి కొన్ని సినిమాలకు శ్రీలీల సైన్ చేసింది.

Telugu Balakrishna, Srileela, Mahesh Babu, Nithin, Pawan Kalyan, Ram Pothineni,

సినిమా విడుదల అయ్యాక ఆమె జోరు మరింత పెరిగింది.ఇప్పుడు ఏకంగా పది సినిమాలను లైన్ లో పెట్టి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.ఒక సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కి నాలుగు సినిమాలకు సైన్ చేసి ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది.సితార బ్యానర్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మహేష్ బాబు మూవీ కోసం సెకండ్ హీరోయిన్ గా ఆమెను ఎప్పుడో సెలెక్ట్ చేయగా, ఇప్పుడు వైష్ణవ తేజ్ హీరో గా రాబోతున్న తన నాల్గవ సినిమా కు కూడా ఆమె హీరోయిన్ గా ఎంపిక అయ్యింది.

Telugu Balakrishna, Srileela, Mahesh Babu, Nithin, Pawan Kalyan, Ram Pothineni,

ఇదే కాకుండా అనగనగా ఒక రాజు సినిమాలో నవీన్ పోలిశెట్టి సరసన సైతం శ్రీలీలను హీరోయిన్ గా ఎంచుకున్నారు.తాజాగా విజయ్ దేవరకొండ 12 వ సినిమా కోసం కూడా శ్రీలీల కె అవకాశం ఇచ్చారు సితార బ్యానర్ వారు.ఈ నాలుగు సినిమాలు కాకుండ పవన్ కళ్యాణ్ తో ఇప్పటికే రెండు సినిమాలకు కమిట్ అయ్యింది.ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో సెకండ్ లీడ్ గా కనిపించబోతున్న శ్రీలీల

Telugu Balakrishna, Srileela, Mahesh Babu, Nithin, Pawan Kalyan, Ram Pothineni,

దానయ్య బ్యానర్ లో వస్తున్న పవన్ OG సినిమా కు మాత్రం మెయిన్ లీడ్ గా సెలెక్ట్ అయ్యింది.ఇవి మాత్రమే కాదు రామ్ పోతినేని తో ఒక సినిమా, నితిన్ తో ఒక చిత్రం, నందమూరి బాలకృష్ణ 108 చిత్రం కోసం కూడా శ్రీలీలను ఇప్పటికే సెలెక్ట్ చేసారు.ఇక వారాహి వారు తీస్తున్న తెలుగు మరియు కన్నడ సినిమా అయినా జూనియర్ లోను శ్రీలీల నటిస్తుంది.

ఇదండీ మొత్తానికి ఒక మూడు నాలుగు ఏళ్ళ పాటు శ్రీలీల చేయబోతున్న సినిమాలు.ఈ పది సినిమాల్లో ఒక నాలుగు సినిమాలు హిట్ అయ్యినా కూడా శ్రీలీల స్థానానికి డోకా ఉండదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube