దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఓ ప్రాజెక్టు టేకప్ చేసిండు అంటే మంచి అవుట్ ఫుల్ రావాల్సిందే.ఆ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్లకు కూడా మంచి గుర్తింపు రాక తప్పదు.
సాధారణ స్థాయి నుంచి టాప్ రేంజికి వెళ్లక తప్పదు.హీరోయిన్లను రాఘవేంద్ర రావు చూపించినంత అందంగా మరెవరూ చూపించలేరని చెప్పుకోవచ్చు.
తాజాగా ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన మూవీ పెళ్లి సందD. ఆర్కా మీడియా, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్ మీద కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో ఈ సినిమా వచ్చింది.
ఈ సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా చేయగా… హీరోయిన్ గా శ్రీలీల నటించింది.పోయిన దసరాకు ఈ సినిమా విడుదల అయ్యింది.మంచి టాక్ తెచ్చుకుంది.కమర్షియల్ గా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
వాస్తవానికి ఈ సినిమా సక్సెస్ లో హీరోయిన్ పాత్రే ఎక్కువ అని చెప్పుకోవచ్చు.ఆమె నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు.
శ్రీలీల అందం, అభినయానికి యంగ్ హీరోలు, స్టార్ హీరోలు సైతం తమ సినిమాల కోసం రికమెండ్ చేస్తున్నారు.అయితే తన తొలి సినిమాకు 5 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ రెండో సినిమాకు 40 లక్షలు తీసుకుంది.
తాజాగా సినిమాకు 75 లక్షలు తీసుకుంటుందట.ఒకటి రెండు వరుస హిట్లు పడితే ఆమె కోసం కోటి రూపాయలు పెట్టక తప్పదనే టాక్ నడుస్తుంది.
ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చేస్తున్న ఈ అమ్మడుని జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం అడిగారట.ఇందులో తనను రెండో హీరోయిన్ గా తీసుకునేందుకు సంప్రదించారట.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు.అయితే పెద్ద హీరోల పక్కన రెండు హిట్లు పడితే టాప్ హీరోయిన్ గా శ్రీలీల ఎదగడం ఖాయం అనే టాక్ ఇండస్ట్రీలో కొనసాగుతుంది.
ప్రస్తుతం ఉన్న రష్మిక, పూజా హెగ్డేను సైతం వెనక్కి నెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు సినీ జనాలు.