చెట్టెక్కి మరీ మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి గారు.... ఎక్కడంటే!

మంత్రుల మీడియా సమావేశం అనగానే ఎక్కడో ఏసీ హాళ్లలోనో, లేదంటే మరేదైనా మంత్రిగారి కార్యాలయంలోనే ఎక్కడైనా నిర్వహిస్తూ ఉంటారు.అయితే ఈ మంత్రిగారు మాత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ ను ఒక కొబ్బరి చెట్టు పై నిర్వహించారు.

 Srilanka Minister Press Conference On Top Of The Coconut Tree, Srilanka Minister-TeluguStop.com

ఈ ఘటన శ్రీలంకలోని వాయువ్య ప్రావిన్స్ లో చోటుచేసుకుంది.కొబ్బరి, పిష్‌టైల్ పామ్, రబ్బర్ ఉత్పత్తుల శాఖ మంత్రి అరుండికా ఫెర్నాండో గురువారం డాంకోటువాలోని తన కొబ్బరి ఎస్టేట్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

అయితే మీడియా అక్కడకి చేరుకున్నాక ఓ కొబ్బరి చెట్టు ఎక్కిన మంత్రి కొబ్బరి బొండాలు కోస్తూ అక్కడి నుంచే వారితో మాట్లాడారు.అయితే దేశవ్యాప్తంగా కొబ్బరి సంబంధింత ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో.

కొబ్బరికాయల ధరలు కూడా విపరీతంగా పెరిగాయని తెలిపిన మంత్రిగారు కొబ్బరి కాయలు కోసే వ్యక్తలకు ఒక్కొ చెట్టుకు 100 రూపాయలు ఇవ్వాల్సి పడుతుంది అని అన్నారు.అలానే కోబ్బరికాయలు కోయడం, ఉత్పత్తికి సంబంధించి.

ఉద్యోగులు దొరకడం కూడా చాలా కష్టంగా మారిందన్న మంత్రిగారు, ధరలు పెరిగినప్పటికీ కొబ్బరికాయలు మాత్రం దిగుమతి చేయబోమని హామీ ఇచ్చారు.

అయితే మంత్రిగారు ప్రెస్ కాన్ఫరెన్స్ ను ఎందుకు ఇలా కొబ్బరి చెట్టు ఎక్కి,కొబ్బరి కాయలు కోస్తూ నిర్వహించారు అంటే, కొబ్బరి ఉత్పత్తులకు సంబంధించిన వాస్తవాలను బలంగా రైతుల్లోకి తీసుకెళ్లడానికే ఆయన ఈ విధంగా చేశారని భావిస్తున్నారు.

మొత్తానికి ఈ మంత్రిగారి వినూత్న ప్రెస్ కాన్ఫరెన్స్ మాత్రం అందరికీ గుర్తుండిపోతుంది అన్నమాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube