కివీస్ చేతిలో చిత్తుగా ఓడిన లంక జట్టు  

Srilanka Lost The Match Against New Zealand In World Cup 2019-

ప్రపంచ కప్ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే.గత నెల 30 వ తారీఖు నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఈ వరల్డ్ కప్ ఫీవర్ ప్రారంభమైంది.దీనిలో భాగంగా శనివారం కార్టిప్ లోని సోఫియా గార్డెన్స్ లో శ్రీలంక,న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్ లో లంక పై న్యూజిలాండ్ ఘన విజయాన్ని అందుకుంది..

Srilanka Lost The Match Against New Zealand In World Cup 2019--Srilanka Lost The Match Against New Zealand In World Cup 2019-

తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడం తో లంక జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది.అయితే శ్రీలంక బ్యాట్స్ మెన్స్ కివీస్ బౌలర్ల ధాటికి చేతులు ఎత్తేయడం తో ఆ జట్టు కేవలం 136 పరుగులకే ఆలౌట్ అయ్యింది.లంక బ్యాట్స్ మన్ లలో కరుణ రత్నే 52,కుషల్ పెరీరా 29, తిషారా పెరీరా 27 లు మాత్రమే రాణించడం తో లంక జట్టు ఆ మాత్రమైనా పరుగులు సాధించింది.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన కివీస్ జట్టు ఓపెనర్లు మార్టిన్ గుప్తిల్,కొలిన్ మన్రో చెలరేగి ఆడడం తో కేవలం ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా లంక నిర్దేశించిన లక్ష్యాన్ని ఈజీ గా ఛేదించింది.మంచి ఫామ్ లో ఉన్న కివీస్ బ్యాట్స్ మేన్స్ వికెట్లు పడగొట్టడం లో లంక బౌలర్లు విఫలమయ్యారు.న్యూజిలాండ్ బౌలింగ్‌లో మాట్ హెర్నీ 3, లాకీ ఫెర్గుసన్‌ 3, కొలిన్ డి గ్రాండ్‌హోం, బౌల్ట్, నీశమ్, శాంట్నర్ ఒక్కో వికెట్ తీశారు.