శ్రీలంక క్రికెటర్లకు తప్పిన భారీ ప్రమాదం..!

ఈ మధ్య క్రికెటర్లకు అనేక ఇబ్బందులనేవి తలెత్తుతున్నాయి.కరోనా వచ్చి చాలా మంది క్రికెటర్లు అనేక అవస్థలు పడాల్సి వచ్చింది.

 Srilanka Cricket Players Flight Landed In India Due To Fuel Efficacy , Srilanka-TeluguStop.com

తాజాగా శ్రీలంక క్రికెటర్లకు పెద్ద గండమే తప్పింది.శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్నటువంటి విమానం ప్రమాదానికి గురైంది.

విమానంంలో ఇంధన సమస్యలు రావడం వల్ల క్రికెటర్లు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.ఇంధన సమస్య రావడం వలన ఆ విమానాన్ని హఠాత్తుగా ల్యాండ్ చేశారు.

ఆ విమానాన్ని భారత్ లో ల్యాండ్ చేశారు.ఈ ప్రమాదం వలన క్రికెటర్లు, శ్రీలంక క్రికెట్ టీమ్ సహాయక సిబ్బంది టెన్షన్ పడ్డారు.

ఈ విషయాన్నే టీమ్ కోచ్‌ మైక్‌ ఆర్థర్‌ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ఆ విమానం అనేది భారతదేశంలో ల్యాండ్‌ అయ్యింది.

ఆ సమయంలోనే తాను ఫోన్‌ ఆన్‌ చేసినట్లు, ఇంగ్లండ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ వేన్‌ బెంట్లీ నుంచి తనకు కొన్ని మెస్సేజులు వచ్చినట్లు ఆయన తెలిపాడు.ప్రమాద సమయంలో తన పరిస్థితి ఏంటో వివరించినట్లు మైక్‌ ఆర్థర్ చెప్పుకొచ్చాడు.

ఇంధనం లేకపోవడం వలన నష్టం జరిగిందని, తమ విమానాన్ని భారత్‌కు దారి మళ్లించామని తెలిపాడు.భారత్ లో వాళ్లు దిగిన వెంటనే తన ఫోన్‌ ఆన్‌ చేసినట్లు తెలిపాడు.

ఇంగ్లాండ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ వేన్‌ బెంట్లీ నుంచి తనుకు కొన్ని మెస్సేజలు వచ్చాయన్నారు.తనకు ఆ సమయంలో జరిగిన విషయాన్ని ఆయన సవివరంగా తెలిపాడు.

Telugu England, Landed India, Fuel Efficacy, Day-Latest News - Telugu

ఈ విమానం ప్రమాదం వలన వారంతా ఆందోళన చెందినట్లుగా చెప్పుకొచ్చాడు.మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటించిన శ్రీలంక టీమ్ ఆడిన అన్ని మ్యాచుల్లోనూ విజయం పొందలేదు.అన్నీ మ్యాచుల్లోనూ ఓటమిపాలైంది.ఇంగ్లండ్ జట్టు టీ20 సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది.లంక జట్టును ఇంగ్లండ్ జట్టు క్లీన్‌స్వీప్‌ చేసేసింది.దీంతో సీరిస్ ముగియడంతో తిరిగి తమ దేశానికి వెళ్లడానికి విమానంలో వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube