24 బాల్స్‌కు 75 పరుగులిచ్చిన చెత్త బౌలర్‌  

Srilanka Bowler Kusun Rajitha Create Worst Record Against Australia - Telugu Srilanka Bowler Kusun Rajitha, Srilanka Vs Australia, Yuvaraj Six Sixes In Six Balls

టీ20ల్లో బౌలర్లకు చుక్కలు కనిపిస్తూ ఉంటాయి.ప్రతి బాల్‌ను బౌండరీకి తరలించేందుకు బ్యాట్స్‌మన్స్‌ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

Srilanka Bowler Kusun Rajitha Create Worst Record Against Australia

టెస్టుల్లో ఎంతగా ఓపిక నశించేలా చేస్తారో టీ20ల్లో అంత స్పీడ్‌గా కొట్టేందుకు ప్రయత్నిస్తు ఉంటారు.అలా ఇప్పటి వరకు టీ20ల్లో ఎన్నో రికార్డులు నమోదు అయ్యాయి.

ఆమద్య ఇంగ్లాండ్‌ బౌలర్‌ బౌలింగ్‌లో యూవీ 6 బంతుల్లో ఆరు సిక్సర్లను కొట్టిన విషయం తెల్సిందే.ఆ ఓవర్‌ను సదరు బౌలర్‌ జీవితంలో మర్చి పోయి ఉండడు.

ఇప్పుడు తాజాగా మరోసారి శ్రీలంక బౌలర్‌ కసున్‌ రజిత చెత్త రికార్డును నమోదు చేశాడు.

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో శ్రీలంక టీ20 సిరీస్‌ను ఆడుతోంది.

అందులో భాగంగా మొదట టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో కుసున్‌ 4 ఓవర్ల బౌలింగ్‌ చేశాడు.ఆ నాలుగు ఓవర్లకు గాను అతడు ఏకంగా 75 పరుగులు ఇచ్చాడు.

ఇప్పటి వరకు అత్యధిక పరుగులు ఇచ్చిన టీ20 బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.ఆస్ట్రేలియా చేసిన స్కోర్‌లో సగంకు ఎక్కువగా ఇతడు బౌలింగ్‌ చేయగా వచ్చిన పరుగులే ఎక్కువగా ఉన్నాయి.

అత్యంత చెత్త బౌలింగ్‌ రికార్డు ఈయనకు దక్కింది.ఈ చెత్త రికార్డు మరెవ్వరు బ్రేక్‌ చేయక పోవచ్చు అంటూ క్రీడా నిపుణులు అంటున్నారు.

తాజా వార్తలు

Srilanka Bowler Kusun Rajitha Create Worst Record Against Australia-,srilanka Vs Australia,yuvaraj Six Sixes In Six Balls Related....