కొత్త సంవత్సరంలో రెండు సిరీస్ లకి టీమ్ ఇండియా జట్లు ఎంపిక

ఈ ఏడాది ఘనంగా తన ప్రస్తానం కొనసాగించిన కోహ్లి సేన అప్రతిహిత విజయాలతో కొత్త సంవత్సరంలోకి ప్రవేశించబోతుంది.ఈ ఏడాదిని వరుసగా టీ20, వన్డే సీరీస్ విజయాలతో ముగించిన టీమ్ ఇండియా వచ్చే ఏడాది ఆరంభంలోనే రెండు దేశాలతో వన్డే సీరీస్ లకి సిద్ధమవుతుంది.

 Srilanka Australia Virat Kohili Indian-TeluguStop.com

స్వదేశంలో ఆస్ట్రేలియా, లంకతో ఒక వన్డే సీరీస్, ఒక టీ20 సీరీస్ ఆడటానికి సిద్ధమవుతుజ్ఞ్ది.ఇక ఆస్ట్రేలియా, లంకతో తలపడే టీమ్ ఇండియా జట్లని బీసీసీఐ సెలక్షన్ కమిటీ తాజాగా ప్రకటించింది.

ఆటగాళ్ళ వివరాలని సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ తాజాగా మీడియాతో తెలియజేసారు.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముగ్గురు ఓపెనర్లను ఎంపిక చేశామని లంకతో టీ20 సిరీస్‌కు శాంసన్‌ను బ్యాకప్‌ ఓపెనర్‌గా ఎంపిక చేశామని తెలిపారు.

సర్జరీ తర్వాత కోలుకుంటున్న ఆల్‌రౌండర్‌ హార్డిక్‌ పాండ్యపై జనవరి మూడో వారంలోగా ఓ నిర్ణయానికి వస్తామని చెప్పారు.ఇక టీమ్ ఇండియా వన్డే, టీ20 జట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు… విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, శివమ్‌ దూబే, చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, నవదీప్‌ సైనీ, శార్దుల్‌ ఠాకూర్‌, బుమ్రా, మనీశ్‌ పాండే, సంజూ శాంసన్‌ ను ఎంపిక చేశారు.లంకతో టీ20 సిరీస్‌కు విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, శివమ్‌ దూబే, చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, బుమ్రా, నవదీప్‌ సైనీ, శార్దుల్‌ ఠాకూర్‌, మనీశ్‌ పాండే, వాషింగ్టన్‌ సుందర్‌, సంజూ శాంసన్‌ ను ఎంపిక చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube