టికెట్ ఇస్తారా ..? ఆత్మహత్య చేసుకోమంటారా ..?  

తెలంగాణాలో ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి తలనొప్పులు తప్పడం లేదు. టికెట్ ఆశిస్తున్న వారంతా పార్టీ అధిష్టానాన్ని బెదిరిస్తూ… ఏదో ఒక రకంగా టికెట్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. తాజాగా… తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ సంచలన వ్యాఖ్యలు చేసింది. హుజూర్ నగర్ టికెట్ సైదారెడ్డికి ఇస్తే తెలంగాణ తల్లి విగ్రహం ముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది.

Srikanthachari Mother Shankaramma Sensational Comments-

Srikanthachari Mother Shankaramma Sensational Comments

తనకు హుజూర్ నగర్ టికెట్ రాకుంగా మంత్రి జగదీశ్ రెడ్డి అడ్డుకుంటున్నారని మండిపడింది. ఎన్నారై సైదిరెడ్డికి టికెట్ ఇప్పించేందుకు జగదీశ్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించింది. బీసీ మహిళ అయినందుకే తనకు టికెట్ రాకుండా మంత్రి జగదీశ్ అడ్డుకుంటారని తెలిపింది. జగదీశ్‌ రెడ్డికి అమరవీరుల ఉసురు తగులుతుందన్నారు. మంత్రి జగదీశ్‌ రెడ్డి వందల కోట్లు కూడబెట్టుకున్నారని ఆరోపించారు. కేసీఆర్‌, కేటీఆర్‌లపై తనకు ఎంతో గౌరవం ఉందని శంకరమ్మ స్పష్టం చేసింది.