శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా బోయపాటి ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ మూడు పాత్రలలో కనిపించబోతున్నాడు.

 Srikanth Villain In Bb3 Movie Official, Tollywood, Balakrishna, Boyapati Srinu,-TeluguStop.com

అలాగే ఈ సినిమాలో బాలయ్య కోసం బోయపాటి పవర్ ఫుల్ విలనీ పాత్రలని డిజైన్ చేసినట్లు తెలుస్తుంది.బోయపాటి శ్రీను సినిమా అంటే విలన్ పాత్రలు ఎంత క్రురంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అతని సినిమాలో విలన్ గా నటించిన ఏ నటుడికి అయిన కెరియర్ టర్న్ అయిపోవడం గ్యారెంటీ జగపతి బాబుని లెజెండ్ సినిమాతో పవర్ ఫుల్ విలన్ గా పెజెంట్ చేసి అతని కెరియర్ పూర్తిగా మార్చేశాడు.ఆ సినిమా తర్వాత జగపతి బాబు ఫుల్ బిజీ ఆర్టిస్ట్ అయిపోయాడు.

అలాగే బోయపాటి సరైనోడు సినిమా ద్వారా ఆది పినిశెట్టిని పవర్ ఫుల్ గా పెజెంట్ చేసి అతని కెరియర్ కి ప్లస్ అయ్యేలా చేశాడు.అయితే వినయ విదేయ రామా సినిమాలో వివేక్ ఒబరాయ్ ని తీసుకొని పవర్ ఫుల్ గా ప్రెజెంట్ చేసిన ఆ సినిమా డిజాస్టర్ కావడంతో అనుకున్న స్థాయిలో హైప్ క్రియేట్ కాలేదు.

అయితే బాలకృష్ణతో చేస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో దీని మీద అంచనాలు భారీగానే ఉన్నాయి.ఇందులో ఈ సారి బాలయ్య బాబుని సరికొత్తగా అఘోరా పాత్రలో బోయపాటి ప్రెజెంట్ చేయబోతున్నాడు.

ఇదిలా ఉంటే ఇందులో శ్రీకాంత్ ని విలన్ గా చూపించబోతున్నాడు అనే మాట చాలా రోజులుగా వినిపిస్తుంది.అయితే బోయపాటి నుంచి దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

అయితే తాజాగా బిబి3 టీం శ్రీకాంత్ కి పుట్టినరోజు విషెస్ చెబుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది.ఈ పోస్టర్ ద్వారా బోయపాటి సినిమాలో శ్రీకాంత్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు అనే విషయాన్ని రివీల్ చేయడంతో అతని లుక్ కూడా ఎలా ఉండబోతుంది అనేది ఆడియన్స్ కి హిట్ ఇచ్చేశారు.

మరి ఇప్పటికే శ్రీకాంత్ విలన్ గా ఎంట్రీ ఇచ్చిన రాని సక్సెస్ ఈ సినిమాతో వస్తుందేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube