బాలయ్యతో విలన్ వేషాలు వేస్తున్న హీరో

నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న తాజా చిత్రం రూలర్ ఈ నెల 20న ప్రపంచవ్యాప్త రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఇప్పటికే ఈ సినిమాపై మాస్ వర్గాల్లో మంచి అంచనాలు ఉండగా బాలయ్య రెండు విభిన్న పాత్రలు ఈ సినిమాలో హైలైట్‌గా నిలవనున్నాయని చిత్ర యూనిట్ తెలిపింది.

 Srikanth Turns Villain For Balakrishna-TeluguStop.com

కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే బాలయ్య తన నెక్ట్స్ సినిమాను ఇటీవల ప్రారంభించాడు.

మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ తన నెక్ట్స్ సినిమాను తెరకెక్కించనున్నాడు.

ఈ సినిమాలో బాలయ్యను మరింత పవర్‌ఫుల్‌గా చూపించేందుకు బోయపాటి పక్కా ప్లానింగ్‌ చేస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమాలో బాలయ్య సరసన ఓ బాలీవుడ్ స్టార్ బ్యూటీని తీసుకునేందుకు రెడీ అయిన బోయపాటి, అదే జోష్‌తో ఓ సీనియర్ హీరోను బాలయ్య కోసం విలన్‌గా మార్చనున్నాడు.

ఫ్యామిలీ సినిమాల హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ గతకొంతకాలంగా విలన్, సైడ్ క్యారెక్టర్స్‌తో మెప్పిస్తున్నాడు.

ఇప్పుడు బోయపాటి-బాలయ్య సినిమాలో మరోసారి శ్రీకాంత్‌ను విలన్ పాత్రలో నటింపజేయాలని చూస్తున్నారు చిత్ర యూనిట్.

దీనికోసం లెజెండ్ చిత్రంలోని జగపతిబాబు తరహా పాత్రను రాసుకున్నాడట బోయపాటి.అయితే శ్రీకాంత్ ఈ సినిమాలో నటిస్తున్నాడా లేదా అనేది ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube