ఆ పెళ్ళిసందడి లో "శ్రీకాంత్ ".. నేటి పెళ్ళిసందడి లో "రోషన్" ... స్కెచ్ అదిరింది !

దాదాపుగా పాతికేళ్ల క్రితం వచ్చిన పెళ్లిసందడి సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఓ సంచలనం విజయాన్ని అందుకుంది.1996 లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన విజయవంతమైన కుటుంబ, ప్రేమకథా చిత్రం.శ్రీకాంత్, దీప్తి భట్నాగర్, రవళి ప్రధాన పాత్రలు పోషించారు.కీరవాణి స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు కూడా మంచి ఆదరణ పొందాయి.చిన్న తారాగణంతో కె.రాఘవేంద్రరావు ప్రయోగాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

 Srikanth, Roshan, K Raghavendrarao, Pellisandadi, Tollywood, Nirmalaconvent, Nag-TeluguStop.com

అప్పటివరకు ఒక సాధారణ హీరోగా కొనసాగుతున్న హీరో శ్రీకాంత్ కు ఈ విజయం తో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారారు.ఆ తరువాత శ్రీకాంత్ సినీ కెరియర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోయింది.

ఇకపోతే , మళ్లీ ఇన్నేళ్లకి ఇప్పుడు అదే పెళ్ళిసందడి పేరుతో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మరో సినిమా చేయనున్నట్టు ఈ రోజు ఓ ప్రకటన విడుదల చేశారు.ఈ ప్రకటన ఇప్పుడు టాలీవుడ్ లో ఓ సంచలనంగా మారింది.

అసలు ఈ పెళ్ళిసందడిలో హీరోగా ఎవరు నటిస్తారంటూ టాలీవుడ్ లో అప్పుడే చర్చ కూడా మొదలైంది.

ఈ నేపథ్యంలో రోషన్ పేరు సోషల్ మీడియా లో బాగా వినిపిస్తోంది.

హీరో శ్రీకాంత్ తనయుడే ఈ రోషన్.నాగార్జున నిర్మించిన ‘నిర్మలా కాన్వెంట్’అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు.

ఈ కొత్త పెళ్లిసందడి కి రోషన్ ని రాఘవేంద్రరావు ఎంచుకున్నట్టు చెబుతున్నారు.ఒకవేళ ఇదే నిజమైతే కనుక, ఆనాడు తండ్రి శ్రీకాంత్ కు ఆ ‘పెళ్లిసందడి’ ఎంతగా ప్లస్ అయిందో.

ఇప్పుడు రోషన్ కెరీర్ కు ఈ పెళ్లిసందడి కూడా అంతగానూ ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube