అఖండలో తన పాత్ర గురించి రివీల్ చేసిన శ్రీకాంత్

టాలీవుడ్ లో ఫ్యామిలీ చిత్రాల హీరోగా విశేషమైన లేడీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరోలలో శ్రీకాంత్ ఒకడు.శోభన్ బాబు, జగపతి బాబు తర్వాత ఆ స్థాయిలో లేడీ ఫాలోయింగ్ శ్రీకాంత్ సొంతం చేసుకున్నాడని చెప్పాలి.

 Srikanth Reveal His Role In Akhanda Movie-TeluguStop.com

అయితే ఈ మధ్యకాలంలో హీరోగా సినిమాలు పూర్తిగా తగ్గించేసిన శ్రీకాంత్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా మారే ప్రయత్నం చేస్తున్నారు.ఇక కొత్త పాత్రలతో తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సిద్ధమయ్యారు.

ఇప్పటికే విలన్ గా నాగ చైతన్య సినిమాలో శ్రీకాంత్ కనిపించారు.అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో పెద్దగా ఎవరికి రీచ్ కాలేదు.

 Srikanth Reveal His Role In Akhanda Movie-అఖండలో తన పాత్ర గురించి రివీల్ చేసిన శ్రీకాంత్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తరువాత మలయాళంలో మోహన్ లాల్ మూవీలో విలన్ గా నటించారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం బోయపాటి బాలకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ అఖండలో పవర్ ఫుల్ విలన్ రోల్ ని పోషిస్తున్నారు.

Telugu Akhanda Movie, Balakrishna, Boyapati Srinu, Srikanth, Telugu Cinema, Tollywood-Movie

ఇక ఈ సినిమాలో శ్రీకాంత్ పోషిస్తున్న పాత్ర ఎలా ఉండబోతుంది అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు.తాజాగా అఖండ నుంచి శ్రీకాంత్ క్యారెక్టర్ కి సంబందించిన లుక్ ఒకటి బయటకి వచ్చింది.ఆ లుక్ లో మాసిన గడ్డంతో కాస్తా వయస్సు మళ్ళిన వాడిగా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు.ఇక శ్రీకాంత్ తన పాత్ర గురించి మీడియాతో పంచుకున్నారు.

ఈ సినిమాలో వరదరాజులు అనే పవర్ ఫుల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నా అని చెప్పారు.సినిమాలో విలన్ పాత్ర గొప్పగా వచ్చినప్పుడే హీరో పాత్రకి ఎలివేషన్ వస్తుంది.

అలాగే ఇందులో తన పాత్ర కూడా ఉండబోతుందని చెప్పాడు.అలాగే బాలకృష్ణ పాత్ర కూడా అఘోరా తరహాలో కాకుండా కాస్తా ఆద్యాత్మిక టచ్ ఉన్న రోల్ గా ఉంటుందని చెప్పారు.

#Boyapati Srinu #Balakrishna #Srikanth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు