ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న టాలీవుడ్ సీనియర్ హీరో...

ఇప్పటికే ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టువంటి టాలీవుడ్  సీనియర్ హీరో శ్రీకాంత్ గురించి తెలియని వారుండరు.అయితే ఇటీవల కాలంలో శ్రీకాంత్ సినిమాల పరంగా కొంత మేర జోరు  తగ్గిందని చెప్పుకోవచ్చు.

 Srikanth New Web Series Release News-TeluguStop.com

అయినప్పటికీ అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు అందుబాటులోనే ఉంటున్నాడు.అయితే ప్రస్తుతం శ్రీకాంత్ “చదరంగం” అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ వెబ్ సిరీస్  కి సంబంధించి నటువంటి 1.47 నిమిషాల నిడివిగల ట్రైలర్ విడుదల అయి మంచి ప్రేక్షకాదరణ పొందింది.

అయితే ఈ  ట్రైలర్ ని ఒకసారి పరిశీలించినట్లయితే  ఈ వెబ్ సిరీస్ లో శ్రీకాంత్ అప్పట్లో రాజకీయ సంచలనం సృష్టించిన టువంటి రాజకీయ నాయకుడు మరియు హీరో స్వర్గీయ నందమూరి తారక రామారావు పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.అంతేగాక ఈ చిత్రంలో ఓ పవర్ ఫుల్ రాజకీయ నాయకుడి పాత్రలో నటిస్తుండడంతో శ్రీకాంత్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇన్నాళ్ళకి శ్రీకాంత్ టాలెంట్ నిరూపించుకునేందుకు సరైన అవకాశం వచ్చిందని అభిప్రాయపడుతున్నారు.అయితే ఈ  వెబ్ సిరీస్ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల ఆధారంగా తెరకెక్కినట్లు తెలుస్తోంది.ఈ వెబ్ సిరీస్ లో సీనియర్ నటుడు చలపతిరావు, నాగినీడు, కౌసల్య మరియు సునయన వంటివారు ప్రధాన పాత్రలో నటించారు.ఈ వెబ్ సిరీస్ ని డైలాగ్ కింగ్ మోహన్ బాబు పెద్ద కొడుకు  మంచు విష్ణు నిర్మించారు.

Telugu Chadarangam, Srikanth, Web Chadarangam-Movie

అయితే ఈ వెబ్ సిరీస్ ఈనెల 20వ తారీఖున ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫార్మ్ అయినటువంటి zee5 లో ప్రసారం కానుంది.అయితే అప్పట్లో ఎన్టీఆర్ జీవిత గాధగా తెరకెక్కినటువంటి ఎన్టీఆర్ బయోపిక్ మరియు లక్ష్మీస్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి.మరి శ్రీకాంత్ నటించినటువంటి ఈ రాజకీయ చదరంగం ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube