1997తో శ్రీకాంత్ అయ్యంగార్ సత్తా చాటుకునేనా?

సినిమా రంగంలోకి వచ్చిన చాలా మంది ఓ మాట చెప్తుంటారు.డాక్టర్ కావాలనుకున్నా.

 Srikanth Iyengaru Movie Latest News-TeluguStop.com

కానీ యాక్టర్ అయ్యాను అని చెప్తారు.అయితే కొందరు ఇందుకు పూర్తిగా విరుద్ధం.

డాక్టర్ అయ్యాకే యాక్టర్లుగా మారారు.ఈ కోవలోకి చెందిన వాడే డాక్టర్ రాజశేఖర్.

 Srikanth Iyengaru Movie Latest News-1997తో శ్రీకాంత్ అయ్యంగార్ సత్తా చాటుకునేనా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎంబీబీఎస్ పూర్తయ్యాక తను నటుడిగా మారాడు.అలాగే మరో నటుడు కూడా డాక్టర్ అయ్యాకే సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు.

ఆయన మరెవరో కాదు శ్రీకాంత్ అయ్యంగార్.ఈయన కూడా ఎంబీబీఎస్ డాక్టర్.

అయితే నటన పట్ల ఉన్న మక్కువతోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు.

తెలుగు సినిమా రంగంలో ఇప్పటికే పలు సినిమాలు చేశాడు శ్రీకాంత్.

డియర్ కామ్రేడ్, మెహబూబా, దిశా ఎన్కౌంటర్, మర్డర్, అమరం అఖిలం ప్రేమ, బ్రోచేవారెవరురా సినిమాల్లో నటించి మెప్పించాడు.తన చక్కటి యాక్టింగ్ తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

ఆయన ఈ మధ్యే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలోనూ యాక్ట్ చేశాడు.తాజాగా ఈయన 1997అనే సినిమా చేస్తున్నాడు.47 ఏండ్లకు ఆయనకు దక్కిన బ్రేక్ ను ఆయన కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

శ్రీకాంత్ ప్రధాన పాత్రలో 1997 సినిమా చేశాడు.ఇందులో డాక్టర్ మోహన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించాడు.ఈనెల 26న ఈ సినిమా విడుదల కానుంది.

ప్రస్తుత సమాజంలో కుల, వర్ణ వివక్ష పెరిగిందని ఆయన వెల్లడించాడు.మతం పేరుతోనూ కొందరు విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నాడు.

Telugu 1997 Movie, Dactor Mohan, Intresting Facts, Latest News, Naveen Chandra, Srikanth Iyengar, Tollywood-Latest News - Telugu

దాని కారణంగా సామాన్యుడు ఎలా ఇబ్బందులు పడుతున్నాడనే అంశంతోనే ఈ సినిమా తెరకెక్కిందని వెల్లడించాడు.ఇందులో శ్రీకాంత్ పూర్తి నెగెటివ్ క్యారెక్టర్ చేశాడు.తన పాత్రను సినిమాలో చూస్తే.సమాజంలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా? అనే అసహ్యం కలుతుందని ఆయన వెల్లడించాడు.అంతగా తన పాత్రను దర్శకుడు తయారు చేశాడని చెప్పాడు.ఈ సినిమా చూడాలంటే మరికొద్ది రోజులు ఆగకతప్పదన్నాడు.

#Mohan #Naveen Chandra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube