విలన్ కోసం చుట్టూ తిరిగి మళ్ళీ శ్రీకాంత్ దగ్గర ఆగిన బోయపాటి  

Srikanth Finalised as Villain for Balakrishna, Tollywood, Telugu Cinema, South Cinema, Boyapati Srinu, BB3 - Telugu Balakrishna, Bb3, Boyapati Srinu, South Cinema, Srikanth, Telugu Cinema, Tollywood

బోయపాటి శ్రీను సినిమాలు అంటే పవర్ ఫుల్ హీరోయిజంతో పాటు పవర్ ఫుల్ విలనిజం కూడా ఉంటుంది.విలన్ ని అత్యంత క్రూరుడుగా ప్రెజెంట్ చేయడం ద్వారా అతని సినిమాలలో హీరోయిజం ఎలివేట్ చేస్తూ ఉంటారు.

TeluguStop.com - Srikanth Finalised As Villain For Balakrishna

ఇప్పటి వరకు ఇదే ఫార్ములాతో బోయపాటి సక్సెస్ అయ్యాడు.అయితే కొన్ని సినిమాలలో ఈ విలనిజం అనేది శృతి మించి దెబ్బ తిన్నాడు కూడా.

దమ్ము, వినయవిధేయ రామా సినిమా డిజాస్టర్ కి కారణం ఈ ఓవర్ ఎలివేషన్ అనే విషయం చాలా మంది చెబుతారు.ఇదిలా ఉంటే బోయపాటి, బాలయ్య కాంబినేషన్ అంటే దాని మీద టాలీవుడ్ లో ఒక హైప్ ఉంటుంది.

TeluguStop.com - విలన్ కోసం చుట్టూ తిరిగి మళ్ళీ శ్రీకాంత్ దగ్గర ఆగిన బోయపాటి-General-Telugu-Telugu Tollywood Photo Image

వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గత రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.బోయపాటికి తనని ఎలా ప్రెజెంట్ చేయాలో తెలుసని, అతను తనకి కథ కూడా చెప్పాడని గతంలో బాలయ్య చెప్పిన సంగతి తెలిసిందే.

ఇక తమ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కథ కూడా తనకి పూర్తిగా తెలియదని బాలయ్య ఓపెన్ గా చెప్పేశాడు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలకృష్ణ కోసం బోయపాటి పవర్ ఫుల్ విలన్ ని రంగంలోకి దించాలని అనుకున్నాడు.

దాని కోసం బాలీవుడ్, కోలీవుడ్ నటుల పేర్లు పరిశీలించారు.అయితే ముందుగా ఈ సినిమా కోసం శ్రీకాంత్ పేరు ప్రముఖంగా వినిపించింది.ఇప్పుడు బోయపాటి మళ్ళీ అందరిని పరిశీలించిన తర్వాత శ్రీకాంత్ దగ్గరే ఆగిపోయినట్లు తెలుస్తుంది.ఈ సినిమాలో శ్రీకాంత్ అయితే పెర్ఫెక్ట్ ఛాయస్ అవుతుందని భావిస్తున్నట్లు సమాచారం.

అతని ఆహార్యం మార్చేసి పవర్ ఫుల్ విలన్ గా ప్రెజెంట్ చేయడం ద్వారా సినిమాకి హైప్ క్రియేట్ అవుతుందని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.త్వరలో అఫీషియల్ గా ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందని బోగట్టా.

#Balakrishna #Boyapati Srinu #Srikanth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Srikanth Finalised As Villain For Balakrishna Related Telugu News,Photos/Pics,Images..