శ్రీకాంత్ కు బోయపాటి శ్రీను అన్యాయం చేశారా.. నెటిజన్లు ఏమన్నారంటే?

Srikanth Character Not Work In Akhanda Movie Details Here

బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ మూవీ తొలిరోజే 18 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించింది.బాలకృష్ణ నటనకు, తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు, ఫైట్ మాస్టర్లకు నెటిజన్ల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

 Srikanth Character Not Work In Akhanda Movie Details Here-TeluguStop.com

దర్శకుడు బోయపాటి శ్రీను రోటీన్ కథతోనే ప్రేక్షకులను మెప్పించారని కామెంట్లు వినిపిస్తున్నాయి.అఖండ సినిమాలో శ్రీకాంత్, నితిన్ మెహతా విలన్లుగా నటించారు.

లెజెండ్ సినిమాతో జగపతిబాబుకు ఏ స్థాయిలో పేరు వచ్చిందో అఖండ సినిమాతో శ్రీకాంత్ కు అదే స్థాయిలో పేరు వస్తుందని అభిమానులు భావించారు.అయితే సినిమాలో శ్రీకాంత్ పాత్ర అంచనాలను అనుగుణంగా లేదని కామెంట్లు వినిపించాయి.

 Srikanth Character Not Work In Akhanda Movie Details Here-శ్రీకాంత్ కు బోయపాటి శ్రీను అన్యాయం చేశారా.. నెటిజన్లు ఏమన్నారంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మెయిన్ విలన్ గా నితిన్ మెహతా నటించడంతో శ్రీకాంత్ పాత్ర సినిమాలో తేలిపోయింది.శ్రీకాంత్ పరిచయ సన్నివేశాలు బాగున్నా ఆ తర్వాత సీన్స్ సాధారణంగానే ఉన్నాయి.

శ్రీకాంత్ ఇప్పటికే యుద్ధం శరణం అనే సినిమాలో విలన్ రోల్ లో నటించారు.ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేదు.

Telugu Akhanda, Akhandavillain, Allu Arjun, Balakrishna, Boyapati Srinu, Villain, Nithin Mehtha, Srikanth-Movie

సినిమాలో శ్రీకాంత్ పాత్రను సింపుల్ గా ముగించారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.బోయపాటి శ్రీను శ్రీకాంత్ పాత్ర విషయంలో శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేదని బోయపాటి శ్రీను శ్రీకాంత్ కు అన్యాయం చేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.సోషల్ మీడియాలో శ్రీకాంత్ పాత్ర గురించి చర్చ జరుగుతోంది.

Telugu Akhanda, Akhandavillain, Allu Arjun, Balakrishna, Boyapati Srinu, Villain, Nithin Mehtha, Srikanth-Movie

మరోవైపు బోయపాటి శ్రీను అఖండ హిట్ తో ఫామ్ లోకి వచ్చారు.బోయపాటి శ్రీను తరువాత సినిమాలో అల్లు అర్జున్ హీరో కావచ్చనే కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే ఈ కాంబినేషన్ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

బోయపాటి శ్రీనుకు అఖండతో సక్సెస్ ఖాతాలో చేరినా కొంతమంది మాత్రం ఈ సినిమా గురించి నెగిటివ్ గా కామెంట్లు చేస్తుండటం గమనార్హం.ఈ సినిమాలో హింస ఎక్కువైందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

#Nithin Mehtha #Balakrishna #Srikanth #Boyapati Arju #Boyapati Srinu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube