అడ్డాల 'అన్నాయ్‌' పై మీమ్స్ వర్షం

బ్రహ్మోత్సవం తర్వాత దాదాపుగా నాలుగు సంవత్సరాలు బ్రేక్ తీసుకున్న శ్రీకాంత్‌ అడ్డాల ఎట్టకేలకు నారప్ప సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.తమిళ అసురన్ సినిమా కు రీమేక్ అయిన నారప్ప విడుదల సందర్బంగా తన తదుపరి సినిమా ల కు సంబంధించిన అధికారిక ప్రకటన చేశాడు.

 Director Srikanth Addala Want To Do Annaay Movie With Big Hero, Annay, Narappa,-TeluguStop.com

అన్నాయ్‌ అనే టైటిల్‌ తో భారీ యాక్షన్ మూవీని తెరకెక్కించబోతున్నాను అంటూ శ్రీకాంత్‌ అడ్డాల ప్రకటించినప్పటి నుండి చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ముఖ్యంగా శ్రీకాంత్‌ అడ్డాల బ్రహ్మోమత్సవం సినిమా తర్వాత అయిదు సంవత్సరాల వరకు గ్యాప్ తీసుకున్నాడు.

మరి నారప్ప తర్వాత అన్నాయ్ సినిమాకు ఎన్నాళ్లు బ్రేక్ తీసుకుంటాడో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.అన్నాయ్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభించాలంటే మొదట ఒక స్టార్‌ హీరో కావాలట.

అది కూడా ఆయన మూడు పార్ట్‌ లు గా సినిమా ను చేస్తాను అంటూ ఉన్నాడు కనుక ఏడాదికి పైగా డేట్లు కేటాయించాల్సి ఉంటుంది.

శ్రీకాంత్ అడ్డాలను నమ్మి ఏడాది డేట్లు కేటాయించడం అంటే మామూలు విషయం కాదు.

అందుకోసం ఏ హీరో అయితే సాహసం చేస్తాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.అల్లు అరవింద్‌ ఇప్పటికే ఈ భారీ సినిమాను నిర్మించేందుకు ఓకే చెప్పాడట.

శ్రీకాంత్‌ అడ్డాల చెప్పిన కథను నమ్మిన అల్లు అరవింద్‌ పెట్టుబడి పెడతాడు.

Telugu Annaay, Brahmotsavam, Ppa, Allu Aravind, Srikanth Addala, Srikanthaddala,

కాని ఆయన్ను నమ్మి నటించేందుకు ముందుకు వచ్చేది ఎవరు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.శ్రీకాంత్‌ అడ్డాల అన్నాయ్‌ సినిమా ఎంత వరకు వర్కౌట్‌ అవుతుంది అనేది కూడా క్లారిటీ లేదని.ఆయన మరీ అతి విశ్వాసంతో ఉన్నాడంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

 అన్నాయ్‌ కాకుండా మొదట ఒక చిన్న సినిమాను ఆయన చేస్తే బెటర్ అంటూ కొందరు సలహాలు ఇస్తున్నారు.మరి అన్నాయ్‌ తోనే అడ్డాల కూర్చుంటాడా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube