బ్రహ్మూెత్సవం డైరెక్టర్‌ కాపీ పేస్ట్‌ చేసేందుకు సిద్దం అవుతున్నాడట  

Srikanth Addala To Remake Asuran Telugu With Venkatesh-director Srikanth Addala,shriya,venkatesh

కొత్త బంగారు లోకం చిత్రంతో ఒక మంచి దర్శకుడు అనిపించుకున్న శ్రీకాంత్‌ అడ్డాల ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో స్టార్‌ డైరెక్టర్స్‌ జాబితాలో చేరి పోయాడు.ముకుంద మరియు బ్రహ్మూెత్సవం సినిమాలతో నిరాశ పర్చాడు.

Srikanth Addala To Remake Asuran Telugu With Venkatesh-director Srikanth Addala,shriya,venkatesh Telugu Tollywood Movie Cinema Film Latest News-Srikanth Addala To Remake Asuran Telugu With Venkatesh-Director Shriya Venkatesh

ముఖ్యంగా బ్రహ్మూెత్సవం సినిమా మరీ దారుణమైన పరాజయం పాలయ్యింది.అత్యంత చెత్త సినిమాగా అది రికార్డు సాధించింది.

Srikanth Addala To Remake Asuran Telugu With Venkatesh-director Srikanth Addala,shriya,venkatesh Telugu Tollywood Movie Cinema Film Latest News-Srikanth Addala To Remake Asuran Telugu With Venkatesh-Director Shriya Venkatesh

చెత్త సినిమా రికార్డును మహేష్‌బాబు ఖాతాలో పడేలా చేసిన శ్రీకాంత్‌ అడ్డాల బ్రహ్మూెత్సవం తర్వాత చాలా సైలెంట్‌ అయ్యాడు.

కొత్త వారితో సినిమా తీయబోతున్నట్లుగా వార్తలు వచ్చినా ఏ నిర్మాత కూడా ఆయనతో సినిమాకు ధైర్యం చేయలేదు.

ఎట్టకేలకు ఈయనకు ఒక ఛాన్స్‌ వచ్చింది.తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన అసురన్‌ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయబోతున్నారు.

వెంకటేష్‌ హీరోగా నటించబోతున్న ఈ సినిమాకు ఓంకార్‌ దర్శకత్వం వహించబోతున్నట్లుగా మొదట వార్తలు వచ్చాయి.కాని ఇప్పుడు ఆ వార్తలు నిజం కాదని, శ్రీకాంత్‌ అడ్డాల తెలుగు అసురన్‌ను తెరకెక్కించబోతున్నట్లుగా చెబుతున్నారు.

తెలుగు అసురన్‌కు ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది.తమిళంలో ఉన్నది ఉన్నట్లుగా తెలుగులో దించేయడమే.కనుక ఎలాంటి క్రియేటివిటీ అక్కర్లేదు.

దర్శకుడు ఎలాంటి వారు అయినా పర్వాలేదు.అందుకే శ్రీకాంత్‌ అడ్డాలను కాపీ పేస్ట్‌ కోసం ఎంపిక చేసుకున్నారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

సురేష్‌బాబు చాలా తెలివిగా పబ్లిసిటీ వస్తుందనే ఉద్దేశ్యంతో శ్రీకాంత్‌ అడ్డాలను ఈ చిత్రంకు ఎంపిక చేసి ఉంటాడు అంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.