పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే.వకీల్ సబ్ సినిమాతో మూడేళ్ళ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు.
దీంతోపాటు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో అయ్యప్ప కోషియం రీమేక్లో కూడా పవన్ కళ్యాణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
ఈ రెండు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.కంప్లీట్ డిఫరెంట్ జానర్ సినిమాలు ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్లే పవన్ కళ్యాణ్ వాటిని వీలైనంత వేగంగా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
వీటి తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఒక సినిమా చేయనున్నాడు.దీని తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ మూవీ ఉన్న సంగతి తెలిసిందే.

అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పవన్ కళ్యాణ్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే వకీల్ సాబ్ సినిమాతో పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని తన డ్రీంని దిల్ రాజు ఫుల్ ఫిల్ చేసుకోవడంతోపాటు భారీ హిట్ కొట్టి లాభాలు కూడా సొంతం చేసుకున్నాడు.ఈ నేపథ్యంలో దిల్ రాజు మరో సినిమా చేయడానికి పవన్ ఓకే చెప్పారు.దీంతో దిల్ రాజు ప్రస్తుతం తన రైటింగ్ టీంతో పవన్ కళ్యాణ్ కోసం మంచి కథను సిద్ధం చేసే పనిలో పడ్డారు.
దిల్ రాజుకి కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి బ్లాక్బస్టర్ హిట్స్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాలకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం మంచి కథను సిద్ధం చేసే అవకాశం దొరికింది.దిల్ రాజు శ్రీకాంత్ ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ కోసం ఇప్పుటి వరక చేయనటువంటి మంచి కథను రెడీ చేయాలని సూచించినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్.
ఈ నేపధ్యంలో అతను కూడా పవన్ కోసం ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని సిద్ధం చేసి మెప్పించే పనిలో పడ్డట్లు తెలుస్తుంది.మరి ఈ ప్రాజెక్టు ఎంతవరకు సెట్ అవుతుంది అనేది వేచి చూడాలి.