ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే ఒక డైరెక్టర్ కి మంచి గుర్తింపు రావడం అనేది సాధారణమైన విషయం కాదు.అప్పటి వరకు స్టార్ డైరెక్టర్స్( Star Directors ) గా ఇండస్ట్రీ ని ఏలుతున్న డైరెక్టర్స్ మధ్య, తమని తాము నిరూపించుకొని తక్కువ సమయం లోనే స్టార్ డైరెక్టర్ గా ఎదగడం అంటే ఎలాంటి ప్రతిభ ఉండాలో అర్థం చేసుకోవచ్చు.
అలాంటి ప్రతిభ ఉన్న డైరెక్టర్స్ లో ఒకడు శ్రీకాంత్ అడ్డాల( Srikanth Addala ).ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ డైరెక్టర్ ని ‘కొత్త బంగారు లోకం’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు.
ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషన్ ని సృష్టించిందో మన అందరికీ తెలిసిందే.ఈ సినిమా తో శ్రీకాంత్ అడ్డాల పేరు ఇండస్ట్రీ లో మారుమోగిపోయింది.
దాంతో మళ్ళీ దిల్ రాజు శ్రీకాంత్ అడ్డాల తో ఏకంగా మహేష్ బాబు వెంకటేష్ కాంబినేషన్ లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తీసే అదృష్టం కలిపించాడు.

చాలా కాలం తర్వాత టాలీవుడ్ లో వచ్చిన మొట్టమొదటి మల్టీస్టార్రర్ చిత్రం గా ప్రచారం పొందిన ఈ సినిమా అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల కి బ్యాడ్ టైం ప్రారంభం అయ్యింది.ముకుంద మరియు ‘బ్రహ్మోత్సవం'( Brahmotsavam ) సినిమాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి.
దీంతో ఇండస్ట్రీ లో అడ్రస్ లేకుండా పోయాడు శ్రీకాంత్ అడ్డాల.మళ్ళీ చాలా కాలం తర్వాత ఆయన విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’ అనే చిత్రం ద్వారా మన ముందుకు వచ్చాడు.
ఈ సినిమా నేరుగా ఓటీటీ లో విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.ఇప్పుడు ఆయన ‘పెద కాపు 1 ‘( Pedha Kapu 1 ) అనే సినిమా తో మన ముందుకు వచ్చాడు.
ఈ సినిమాకి యావరేజ్ రివ్యూస్ వచ్చాయి కానీ, కలెక్షన్స్ మాత్రం డిజాస్టర్ కా బాప్ అనే రేంజ్ లో ఉన్నాయి.

మొదటి రోజు ఈ చిత్రానికి కేవలం 13 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు( Pedha Kapu 1 Collections ) మాత్రమే వచ్చాయి.ఇంత నీచమైన వసూళ్లు ఈమధ్య ఏ సినిమాకి కూడా రాలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.రెండవ రోజు అయితే కేవలం 9 లక్షల రూపాయిల షేర్ మాత్రమే వచ్చింది.
మొత్తం మీద ఈ సినిమాకి రెండు రోజులకు కలిపి 21 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.ఇది కనీసం పోస్టర్ ఖర్చులు మరియు ప్రింట్ ఖర్చులు కూడా రాబట్టలేకపోయింది అన్నమాట.
దీనితో పాటుగా ఇంటర్వ్యూస్ కి కూడా అదనంగా ఖర్చు అవ్వడం తో వచ్చిన ఆ 21 లక్షల షేర్ నిర్మాతల వడ్డీలను కూడా తీర్చలేదు.శ్రీకాంత్ అడ్డాల ఇక నుండి అయిన ఇండస్ట్రీకి దూరం గా ఉంటే అందరికీ మంచిది అని అంటున్నారు ట్రేడ్ పండితులు.