పురుగుల మందు తాగి యువకుడి మృతి.. ఎందుకంటే !

ఉద్యోగం రాలేదని తీవ్ర మనస్థాపానికి గురైన ఓ యువకుడు పురుగులు మందుతాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.రాజాం మండలం బొద్దాం గ్రామానికి చెందిన బొమ్మన మధు (30) ఇంజినీరింగ్ కంప్లీట్ చేసుకున్నారు.

 Srikakulam Young Man Suicide-TeluguStop.com

చదువు పూర్తయిన తర్వాత ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగాన్ని సంపాదించాడు.లాక్ డౌన్ లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికి వచ్చాడు.

ఇంటికి చేరుకున్న మధు ఇంట్లో ఖాళీగా కూర్చున్నాడు.తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయాడు.ఖాళీగా ఇంటి వద్దనే ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయాడు.చదువుకున్న చదువులకు ఉద్యోగం చేయకుండా తల్లిదండ్రులపై ఆధారపడటం అతనికి నచ్చలేదు.

 Srikakulam Young Man Suicide-పురుగుల మందు తాగి యువకుడి మృతి.. ఎందుకంటే -Telugu Crime News(క్రైమ్ వార్తలు)-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రోజూ మానసికంగా కుంగిపోయేవాడు.లాక్ డౌన్ లో ఉన్న జాబులను తీసేస్తున్నారు.

ఈ సమయంలో కొత్త జాబ్ అంటే ఎక్కడ దొరుకుతుందని ఆవేదనతో వాపోయేవాడు.

ఈ క్రమంలో కఠిన నిర్ణయం తీసుకున్నాడు.

ఈ నెల 3వ తేదీన కలుపు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అది గుర్తించిన కుటుంబ సభ్యులు స్థానికులు రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అక్కడ చేర్చుకోకపోవడంతో అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రికి తరలించారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు.

దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

#Suicide #Young Man #Srikakulam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు