చనిపోయినా అవయవదానంతో నలుగురికి ప్రాణం పోసిన యువతి.. వాళ్లు నిజంగా గ్రేట్ అంటూ?

ప్రజల్లో పెద్దగా అవగాహన లేదు కానీ అవయవదానం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చు.శ్రీకాకుళం జిల్లా( Srikakulam District )లోని రైతు కుటుంబానికి చెందిన మౌనిక బాల్యం నుంచి బాగా చదువుకుని తన టాలెంట్ తో ప్రభుత్వ ఉద్యోగం సాధించింది.

 Srikakulam Ward Sachivalayam Employee Mounika Inspirational Story Details Here G-TeluguStop.com

కొన్నిరోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.జీవన్మృతి అని వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పడంతో మౌనిక తల్లీదండ్రులు ఆమె అవయవాలను దానం చేసి మరో నలుగురి జీవితాల్లో వెలుగు నింపారు.

మౌనిక తల్లీదండ్రుల మంచి మనస్సు గురించి ఎంత మెచ్చుకున్నా తక్కువేనని మరి కొందరు సోషల్ మీడియా( Social media ) వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఎచ్చెర్ల మండలం కొత్తపేటకు చెందిన బొడిగి గోవిందరావు, ఉమాదేవి దంపతుల కూతురు మౌనిక సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా చదివారు.2019 సంవత్సరం అక్టోబర్ నెల నుంచి మౌనిక శ్రీకాకుళం రైతు బజార్ సమీపంలో ఉన్న సచివాలయంలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు.

ఈ నెల 23వ తేదీన ఆమె స్కూటీపై వస్తున్న సమయంలో బైక్ ఢీ కొనడంతో తీవ్ర గాయాలయ్యాయి.వైద్యులు అన్ని పరీక్షలు చేసి జీవన్మృతి అని చెప్పడంతో తన కుమార్తె అవయవాలను దానం చేయడానికి తల్లీదండ్రులు అంగీకరించారు.కళ్లను రెడ్ క్రాస్ కు, కిడ్నీలలో ఒక కిడ్నీని విశాఖలోని ఆస్పత్రిక్ అందజేశారు.

గుండెను తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి అప్పగించారు.మౌనిక( Mounika ) మెదడులో రక్తనాళాలు చిట్లిపోవడంతో తీవ్ర రక్తస్రావమైందని వైద్యులు తెలిపారు.

మౌనిక మరణ వార్త ఆమె కుటుంబ సభ్యులను బాధ పెడుతోంది.మౌనిక భౌతికంగా మరణించినా ఆమె ఎంతోమంది హృదయాల్లో జీవించి ఉంటారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

మౌనిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తే బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube