కువైట్ లో పనుల్లేక అల్లాడిపోతున్న సిక్కోలు వాసులు

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది ప్రజలు బ్రతుకు తెరువు కోసం అరబిక్ దేశాలకి వలస వెళ్తూ ఉంటారు.అక్కడ ఏదో ఒక పని చేస్తూ వచ్చిన సంపాదన ఇంటికి పంపిస్తూ ఉంటారు.

 Srikakulam People In Kuwait Are In Trouble, Migrate Workers, Sikkolu, Corona Ef-TeluguStop.com

అయితే ఈ కరోనా ప్రభావంతో మొత్తం అన్ని రంగాలలోని పనులు ఆగిపోవడంతో ఇప్పుడు కూలి కోసం దేశం దాటినా తెలుగు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రోజు కూలి మీద ఆధారపడే వీరికి గత మూడు నెలలగా పనులు లేక ఖాళీగా ఉన్నారు.

పనులు లేకపోవడంతో యజమానులు కూడా జీతాలు ఇవ్వడం లేదు.దీంతోవారంతా దిక్కుతోచని స్థితిలో అక్కడ మగ్గిపోతున్నారు.

ఇండియాకి వారిని ప్రభుత్వం తీసుకొస్తుందని ఆశతో బ్రతుకుతున్నారు.వందే భారత్ మిషన్ క్రింద విదేశాల్లో ఉన్న ధనవంతులని ఇండియాకి తరలించిన కేంద్ర ప్రభుత్వాలు ఇలా కూలీలా మీద మాత్రం దృష్టిపెట్టలేదు.

దీంతో వారంతా దారుణ పరిస్థితిలో ఉన్నారు.

సంతబొమ్మాళి మండలంలోని సుమారు 200 మంది యువకులు 2018లో కువైట్‌ వెళ్లారు.

వెల్డింగ్, రిగ్గర్‌ పనులు చేసుకుంటూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్న సమయంలో కరోనా వీరి ఉపాధిని ధ్వంసం చేసింది.కోవిడ్‌ ప్రభావంతో కువైట్‌లో ప్రైవేటు కంపెనీలు పనులు ఆపేశాయి.

దీంతో మూడు నెలలుగా పనుల్లేక, జీతాలు రాక వీరు అల్లాడిపోతున్నారు.పనులు నిలుపుదల చేసిన మొదటిలో కంపెనీ భోజనాలు పెట్టిన ఆ తర్వాత చేతులెత్తేసింది.

దీంతో దాచుకున్న డబ్బులను వీరంతా ఖర్చు పెట్టేశారు.ఇప్పుడు తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తుంటే వాటితోనే కడుపు నింపుకుంటున్నారు.

కుటుంబాలను పోషించడానికి ఇంత దూరం వస్తే మళ్లీ ఆ కుటుంబాలపైనే ఆధార పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.స్వదేశానికి పంపేయండి అని కంపెనీ యాజమాన్యానికి చెప్పిన వారు తమ వల్ల కాదంటూ తెగేసి చెప్పేశారు.

దీంతో తల్లిదండ్రులు ఏజెంట్లను సంప్రదించారు.వారిది కూడా అదే మాట చెప్పారు.

ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి తమను స్వదేశానికి రప్పించాలని బాధితులు కోరుతున్నారు.కరోనా భయం ఓ వైపు తీవ్రంగా ఉందని, అదే సమయంలో ఉపాధి లేక మరోవైపు నలిగిపోతున్నామని, అధికారులు, ప్రభుత్వమే తమపై దయ చూపాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube