ఈ నటుడిని శ్రీకాకుళంలో అడుగుపెట్టవద్దని వార్నింగ్ ఇచ్చారట.. ఏమైందంటే?

తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా నటుడిగా పార్వతీశంకు మంచి పేరు ఉంది.కేరింత, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, భలే మంచి చౌకబేరం, రోజులు మారాయి, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ సినిమాలు పార్వతీశంకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

 Srikakulam Fans Warning To Parvateesam Why Because-TeluguStop.com

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన పార్వతీశం గతంలో వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చినా నో చెప్పినా ఇప్పుడు ఆఫర్ వస్తే మాత్రం రిజెక్ట్ చేయనని పార్వతీశం అన్నారు.

కామెడీని పండించడం బాగా కష్టమని కేరింత వల్ల అలాంటి పాత్రలకే తనకు ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయని పార్వతీశం చెప్పుకొచ్చారు.

 Srikakulam Fans Warning To Parvateesam Why Because-ఈ నటుడిని శ్రీకాకుళంలో అడుగుపెట్టవద్దని వార్నింగ్ ఇచ్చారట.. ఏమైందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తనకు ఇంకో సక్సెస్ రావాలనే కోరిక ఉందని లైఫ్ లో ఏం కావాలో అనే క్లారిటీ తనకు ఉందని పార్వతీశం తెలిపారు.ఫెయిల్ అయినా తాను ఏం చేయాలని అనిపిస్తే అదే చేస్తానని పార్వతీశం అన్నారు.

నూకరాజు పాత్ర వల్ల శ్రీకాకుళం వాళ్లు ఫీల్ అయ్యారని అందుకే కోడిగుడ్లు కూడా విసిరారని పార్వతీశం చెప్పుకొచ్చారు.

Telugu Kerintha Movie, Nookaraju Role, Palasa, Parvateesam Movie Offers, Rojulu Maarai Promotions, Srikakulam Fans, Thrown Eggs, Tollywood, Warning To Parvateesam-Movie

అయితే లక్కీగా తనకు కోడిగుడ్లు తగలలేదని పార్వతీశం తెలిపారు.చాలామంది నన్ను తిడుతూ మెసేజ్ లు పెట్టారని తప్పు చేశానేమో అనిపించిందని కొంతమంది శ్రీకాకుళంలో అడుగుపెడితే నీ సంగతి చూస్తామని వార్నింగ్ ఇచ్చారని పార్వతీశం చెప్పారు.రోజులు మారాయి ప్రమోషన్స్ కోసం వెళ్లినప్పుడు భయం వేసిందని మీ ఇంట్లో బిడ్డ తప్పు చేస్తే క్షమిస్తారు కదా అలాగే క్షమించమని అడిగానని పార్వతీశం తెలిపారు.

తనది శ్రీకాకుళం జిల్లా పలాస అని పార్వతీశం వెల్లడించారు.

Telugu Kerintha Movie, Nookaraju Role, Palasa, Parvateesam Movie Offers, Rojulu Maarai Promotions, Srikakulam Fans, Thrown Eggs, Tollywood, Warning To Parvateesam-Movie

అయితే కొంతమంది శ్రీకాకుళం వాళ్లు మాత్రం తనను స్టార్ కావాలని కోరుకుంటున్నామని చెప్పారని పార్వతీశం చెప్పుకొచ్చారు.గతంతో పోలిస్తే ఈ నటుడికి ఆఫర్లు కూడా తగ్గాయి.ఈ నటుడు మళ్లీ వరుస ఆఫర్లతో బీజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

#Thrown Eggs #Nookaraju Role #Kerintha #Srikakulam Fans #RojuluMaarai

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు