వైరల్ అవుతున్న శ్రీహరి వీడియో.. చూస్తే కన్నీళ్లాగవు!  

Real Star Srihari Unseen Video viral , real star srihari, unseen video, viral in internet, instagram, Social Media - Telugu Instagram, Real Star Srihari, Real Star Srihari Video Viral, Social Media, Unseen Video, Viral In Internet

రియాల్ స్టార్ శ్రీహరి.ఈ పేరు గురించి ఎంత చెప్పిన తక్కువే.

TeluguStop.com - Srihari Unseen Video Viral In Internet

ఏ పాత్ర అయినా సరే ఎంతో అద్భుతంగా నటించే నటుడు శ్రీహరి.ఎన్నో సినిమాల్లో ఎంతో అద్భుతంగా నటించి మంచి మార్కులు కొట్టేసిన రియాల్ స్టార్ శ్రీహరి.

విలన్ గా, హీరోగా, కమెడియన్ గా, ఏమోషనల్ గా ఎలాంటి పాత్రలో అయినా సరే జీవించే వ్యక్తి శ్రీహరి.అతను నటించిన ఎన్నో సినిమాలు మంచి విజయాన్ని సాధించాయ్.

TeluguStop.com - వైరల్ అవుతున్న శ్రీహరి వీడియో.. చూస్తే కన్నీళ్లాగవు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

డిస్కో శాంతిని పెళ్లి చేసుకున్న ఆయనకు స్టార్ డమ్ అమాంతం పెరిపోయింది.

తన నటన ట్యాలెంట్ చూసి ఎంతోమంది అవాక్కయ్యారు.

మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన శ్రీహరి.విలన్ పాత్రల్లో, కమెడియన్ పాత్రల్లో నటించి అలరించాడు.

అయితే ఆతర్వాత అతని కండల శరీరాన్ని చూసి అతనికి తగ్గట్టు ఉన్న సినిమాల్లో హీరోగా అవకాశం వచ్చింది.శ్రీహరి హీరోగా నటించిన సినిమా సింహాద్రి ఎంతోమంది మనసు దోచింది.

ఇక ఆతర్వాత అయన కీలక పాత్రల్లో నటించిన సినిమాలు అన్ని కూడా మంచి హిట్ కొట్టాయ్.

ఢీ సినిమా, బృందావనం, కింగ్ సినిమాల్లో శ్రీహరి నటనను ఎవరు మరవలేరు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక అలాంటి నటుడు అనారోగ్య సమస్యలతో 2013లో కన్నుమూశారు.అయన హఠాన్మరణం టాలీవుడ్ ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచేసింది.అయితే శ్రీహరికి సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఆ వీడియోలో అయన మాట్లాడిన మాటలు అన్ని కూడా అందరిని బాధపెడుతున్నాయ్.

25 సెకండ్ల నిడివిగల వీడియోలో.శ్రీహరి మాట్లాడుతూ.”నేను ఉన్న లేకపోయినా ఈరోజున అంటే ఓ మనిషికి తృప్తి అనేది ఆరోజున మనం ఓ మనిషికి సాయం చేస్తే .అందుకే అంటారు బ్రతికి ఉండంగా బ్రతకడం కాదు.మనం చనిపోయిన బ్రతకాలి.చనిపోయాక బ్రతకాలంటే మనం మంచి పనులు చేయాలి.ఆ పనులు నేను చేశానని.ఆ భగవంతుడు అంతటి అదృష్టం నాకు ఇచ్చాడని నేను అనుకుంటున్నా” అంటూ శ్రీహరి మాట్లాడిన ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

ఆ వీడియో చూస్తే ఎవరికైనా సరే కన్నీళ్లాగవు అని ఎంతోమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

#RealStar #Social Media #Unseen Video #Instagram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Srihari Unseen Video Viral In Internet Related Telugu News,Photos/Pics,Images..