హీరోగా కెరియర్ మొదలుపెడుతున్న శ్రీహరి కొడుకు  

హీరోగా పరిచయం అవుతున్న శ్రీహరి తనయుడు. .

Srihari Son Ready To Enter As A Hero In Tollywood-ready To Enter As A Hero,real Star Srihari,srihari Son,tollywood

టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి తర్వాత విలన్ గా మారి, తరువాత హీరోగా టర్న్ తీసుకొని యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీహరి. హీరోగా చేస్తున్న టైంలో మరల క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి స్టార్ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీహరి ఊహించని విధంగా ఆరోగ్య సమస్యలతో ఆకస్మికంగా మృతి చెందాడు. అతని మృతి తెలుగు ఇండస్ట్రీలో విషాదం నింపింది..

హీరోగా కెరియర్ మొదలుపెడుతున్న శ్రీహరి కొడుకు -Srihari Son Ready To Enter As A Hero In Tollywood

ఇదిలా ఉంటే శ్రీహరి చనిపోయిన సమయానికి ఇంకా టీనేజ్ లో ఉన్న అతని కొడుకులలో పెద్ద వాడు మేఘంష్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడు.

శ్రీహరితో పాటు ఓ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన మేఘంష్ తండ్రి వారసత్వం తీసుకొని హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమాకి రాజ్ దూత్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. త్వరలో అధికారికంగా ప్రకటించనున్న ఈ సినిమాతో కార్తీక్ – అర్జున్ అనే ఇద్దరు దర్శకులు పరిచయం అవుతున్నారు. రొమాంటిక్ యాక్షన్ లవ్ స్టొరీగా ఈ సినిమా తెరకెక్కుతుంది అని తెలుస్తుంది.