నాట్స్ బోర్డు ఛైర్మన్‌గా శ్రీథర్ అప్పసాని 2020-21 కొత్త కార్యవర్గాన్ని ప్రకటించిన నాట్స్

డిసెంబర్:11 వర్మినిస్టర్, పెన్సిల్వేనియా: 2020-21 నాట్స్ బోర్డ్ కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది.నాట్స్ బోర్డ్ ఛైర్మన్ గా శ్రీధర్ అప్పసానిని ఎన్నుకుంది.

 Sridhar Appasani New Chairman Of Nats-TeluguStop.com

ఫిలడెల్ఫియాలో సమావేశమైన నాట్స్ కార్య నిర్వాహాక బోర్డు 2020-21 కి కొత్త కార్యవర్గంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించింది.నాట్స్ స్థాపనలో కీలక పాత్ర పోషించి… గత పదేళ్లుగా నాట్స్‌లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహారిస్తున్న బోర్డు ప్రస్తుత వైస్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసానికే నాట్స్ బోర్డు ఛైర్మన్ బాధ్యతలు అప్పగించింది.

వైస్ ఛైర్మన్ గా అరుణగంటి, సెక్రటరీగా ప్రశాంత్ పిన్నమనేనిని ఎన్నుకుంది.కొత్త నాయకత్వాన్ని ప్రోత్సాహించే క్రమంలో కొత్తగా పది మందిని బోర్డు సభ్యులుగా తీసుకుంది.

హ్యూస్టన్ టెక్సాస్ చెందిన సునీల్ పాలేరు, డాలస్‌కు చెందిన కిషోర్ వీరగంధం, లాస్ ఏంజిల్స్‌కు చెందిన చందు నంగినేని, కృష్ణ కిషోర్ మల్లిన, చికాగోకు చెందిన శ్రీరామమూర్తి కొప్పాక, రవి శ్రీకాకుళం, ఓహియోకు చెందిన సురేశ్ పూదోట, పెన్సిల్వేనియాకు చెందిన హరినాథ్ బుంగతావులకు 2020-21 నాట్స్ బోర్డు సభ్యులుగా కొనసాగనున్నారు.నాట్స్ బోర్డు కమిటీ సమావేశంలో నాట్స్ హెల్ప్‌లైన్ కార్యక్రమాలను మరింత విసృత్తం చేయాలని నిశ్చయించుకున్నారు.2021లో న్యూజెర్సీలోని, న్యూ జెర్సీ కన్వెన్షన్ అండ్ ఎక్స్పోసిషన్ సెంటర్, 97 సన్‌ఫీల్డ్ అవెన్యూ, ఎడిసన్ లో జరగనున్న అమెరికా తెలుగు సంబరాలకు ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో వ్యవహారించాలని బోర్డు నిర్ణయించింది.

బోర్డు సమావేశం తర్వాత కొత్త నాయకత్వాన్ని పరిచయ కార్యక్రమం ద్వారా నాట్స్ సభ్యులందరికి పరిచయం చేసింది.

హ్యుస్టన్, బోస్టన్, న్యూయార్క్, న్యూజెర్సీ, టెంపా, వర్జీనీయా, డాలస్, లాస్ ఏంజిల్స్, చికాగో, సెయింట్ లూయిస్, డెట్రాయిట్, సౌత్ కరోలినాకు చెందిన నాట్స్ నాయకులు, సభ్యులు కూడా ఈ పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Telugu Nats, Chairman Nats, Telugu Nri Ups-

“నాట్స్ ఛైర్మన్ గా నాకు వచ్చిన అవకాశాన్ని ఓ అదృష్టంగా భావించి నా శాయశక్తులా దానిని సమర్థంగా నిర్వర్తించేందుకు కృషి చేశాననే భావిస్తున్నాను.అయితే నా ప్రతి అడుగులో నాట్స్ సభ్యుల పూర్తి సహాయ సహాకారాలు లభించాయి.ప్రతి ఒక్కరూ ఇది నాది అని పనిచేయడంతోనే నా పని మరింత సులువయింది” అన్నారు శ్రీనివాస్ గుత్తికొండ.

అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి మాట్లాడుతూ, నాట్స్ చేపట్టిన అనేక కార్యక్రమాలు గురుంచి వివరిస్తూ, ప్రస్తుత బోర్డ్ సభ్యులు అందరి సలహాలతోనే ఇన్ని సేవా కార్యక్రమాలు చేయగలిగినట్టు చెప్తూ రాబోయే మీవూరు చైర్మన్ శ్రీధర్ అప్పసాని గారి తో కలిసి మున్ముందు నాట్స్ సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలన్నఆకాంక్షను వెలిబుచ్చారు.

ఇండియా నుంచి గౌతు లచ్చన్న ఫౌండేషన్ (గ్లో) సంస్థ వైస్ ఛైర్మన్ వెంకన్నచౌదరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

దాదాపు 11 కోట్లతో తెలుగు నేలలో నాట్స్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిందని.ఇదంతా నాట్స్ సభ్యుల దాతృత్వంతోనే జరిగిందని వెంకన్న చౌదరి అన్నారు.

నాట్స్ నా బిడ్డ లాంటిది: శ్రీథర్ అప్పసాని


Telugu Nats, Chairman Nats, Telugu Nri Ups-

నాట్స్ సంస్థ నా బిడ్డ లాంటిదని నాట్స్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని అన్నారు.నాట్స్ పుట్టుక నుంచి ఎదుగుదల వరకు ప్రతి అడుగులో తాను కూడా కీలకమైన పాత్ర పోషించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.నాట్స్ ఎదిగే కొద్ది .బిడ్డ ఎదుగుతున్నప్పుడు తండ్రికి కలిగే ఆనందమే నాకు కలుగుతుందని చెప్పారు.నా కుటుంబంతో నాకు ఎంత అనుబంధం ఉందో.అంతే అనుబంధం నాట్స్‌తో ఉందన్నారు.అందుకే నాట్స్ ప్రతి కార్యక్రమంలో కుటుంబం కలిసి పాల్గొంటున్నానని శ్రీధర్ అప్పసాని తెలిపారు.ఏ కార్యక్రమం తలపెట్టినా దానిని చిత్తశుద్ధితో చేయాలనే తపనే నన్ను నాట్స్ లో ఈ కీలక బాధ్యతలు చేపట్టేలా చేసిందన్నారు.నాట్స్ ప్రస్థానంలో తనను ప్రోత్సహించిన నాట్స్ నాయకులందరికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

సన్మానాలు, బహుమతుల పంపిణి


Telugu Nats, Chairman Nats, Telugu Nri Ups-

నాట్స్ ఆహ్వానాన్ని మన్నించి ఇండియా నుంచి వచ్చిన గౌతు లచ్చన్న ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ వెంకన్నచౌదరికి, సేవా సంస్థ నిర్వాహకురాలు సరోజ సాగరంలను నాట్స్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు మధు కొర్రపాటి, మోహన కృష్ణ మన్నవలు సన్మానించారు.నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు ఈ కార్యక్రమంలోనే శ్యాం నాళం, లక్ష్మి మోపర్తి తదితరులు బహుమతులు ప్రదానం చేశారు.

బాంక్వేట్ సమయంలో నరేంద్ర, శిల్పారావ్ పాడిన పాటలతో, సెయింట్ లూయిస్ నుండి ప్రత్యేకంగా వచ్చిన యాంకర్ సాహిత్య ల సందడి తో, ప్రతిభావంతమైన హాస్య నటుడు మరియు మిమిక్రి కళాకారుడైన ఇమిటేషన్ రాజు చేసిన కామెడీ అందరినీ కడుపుబ్బా నవ్వించింది, ” ది ఫుజి” వేదిక దద్దరిల్లింది.

500 మందికి పైగా విచ్చేసిన ఈ కార్యక్రమానికి ఆద్యంతం బావర్చి బిర్యానీ వారు వండి వార్చిన కమ్మని రుచికరమైన విందుభోజనం, పలు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ మెనూ ఆహూతుల మన్ననలను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నాట్స్ ఫిలడెల్ఫియా నాట్స్ నాయకులు రామ్ కొమ్మనబోయిన కీలక పాత్ర పోషించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube