తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంకి, టాలీవుడ్ కి మధ్య ఓ ప్రత్యేక అనుబంధం ఉంది.టాలీవుడ్ లో కుటుంబ కథా చిత్రాలు అంటే కేరాఫ్ అడ్రెస్ రామచంద్రాపురం.
ఆ ఊరి నేపధ్యంలో పుట్టిన ఎన్నో కథలు టాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యాయి.అందుకే తెలుగు దర్శకులకి విలేజ్ బ్యాక్ డ్రాప్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడుకున్న కథలు అంటే ఆ ఊరే గుర్తుకొస్తుంది.
ఆ ఊరికి కేవలం సినిమా కథల పరంగానే కాకుండా ప్రకృతి సౌందర్యం పరంగా కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది.పచ్చని పంటపొలాలు, నిత్యం పారుతూ ఉండే కాలువలు, పల్లెటూరి మనుషులు మధ్య చక్కనైన పల్లెటూరి వాతావరణం ఉంటుంది.
ఈ కారణం చేత రామచంద్రాపురంకి ప్రత్యేక స్థానం ఉంటుంది.ఈ నేపధ్యంలో చాలా మంది తెలుగు దర్శకులు తమ సినిమాల కోసం రామచంద్రాపురం ఎంచుకుంటారు.

ఇప్పుడు పలాస సినిమాతో శ్రీకాకుళం నేపధ్యం తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు కరుణ కుమార్ తన కొత్త సినిమా కోసం రామచంద్రాపురం ఎంచుకున్నారు.కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా శ్రీదేవి సోడా సెంటర్.సుధీర్ బాబు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.ఈ సినిమా ప్రస్తుతం ఈ సినిమా తూర్పు గోదావరి రామచంద్రపురం పరిసరాలలో చిత్రికరణ జరుపుకుంటోంది.దర్శకుడు కరుణ కుమార్ ఆ గ్రామం నేపథ్యంలోనే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమాలో శ్రీదేవిగా తెలుగమ్మాయి ఆనంది నటిస్తుందని తెలుస్తుంది.
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుంది.ఇదిలా ఉంటే ఉంటే శ్రీదేవి సోడా సెంటర్ మూవీలో లైటింగ్ సూరిబాబుగా కనిపించబోతున్నాడు.