జాన్వీ సినిమాల్లోకి వస్తానంటే శ్రీదేవి అలా అన్నారా.. ఎలా తట్టుకోగలవంటూ?

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో ఆఫర్లను సొంతం చేసుకుంటూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే విషయం తెలిసిందే.సౌత్ నుంచి అవకాశాలు వస్తే దక్షిణాది సినిమాలలో నటించడానికి సిద్ధమేనని ఆమె చెప్పుకొచ్చారు.

 Sridevi Reaction About Janvi Kapoor Movie Entry Details Here Goes Viral ,  Janvi-TeluguStop.com

గుడ్ లక్ జెర్రీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ స్టార్ హీరోయిన్ ప్రతి క్షణం అమ్మను ఎంతగానో మిస్ అవుతున్నానని వెల్లడించారు.అమ్మ ప్రతిరోజూ ఉదయాన్నే నిద్ర లేపేదని జాన్వీ తెలిపారు.

అమ్మ ముఖం చూడకుండా నా రోజువారీ మొదలయ్యేవి కావని జాన్వీ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం అమ్మ లేకుండా లైఫ్ ను కొనసాగించడం కష్టంగా అనిపిసోందని జాన్వీ కపూర్ వెల్లడించారు.

ఇండస్ట్రీలోకి నటిగా ఎంట్రీ ఇస్తానని చెప్పిన సమయంలో అమ్మ ఒప్పుకోలేదని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చారు.ఎన్నో సంవత్సరాలు కష్టపడి ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చానని అమ్మ చెప్పేవారని జాన్వీ కపూర్ తెలిపారు.

Telugu Luck Jerry, Janvi Kapoor, Sridevi, Sridevijanvi-Movie

స్టార్స్ జీవితం అంత సౌకర్యవంతంగా ఉండదని అలాంటి రంగంలోకి నువ్వు ఎందుకు వెళ్లాలని అనుకుంటున్నావని అమ్మ అన్నారని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చారు.నువ్వు సున్నిత మనస్కురాలివని సినిమా రంగంలోకి అడుగుపెట్టాక కొంతమంది వ్యాఖ్యలకు నొచ్చుకోక తప్పదని అమ్మ అన్నారని జాన్వీ అన్నారు.సినిమా రంగంలో నెగ్గుకు రావాలంటే కఠినంగా మారాల్సి ఉంటుందని అమ్మ అన్నారని జాన్వీ పేర్కొన్నారు.

Telugu Luck Jerry, Janvi Kapoor, Sridevi, Sridevijanvi-Movie

నా ప్రతి సినిమాను 300 సినిమాలతో పోల్చి చూస్తారని అమ్మ అన్నారని అలాంటివి నువ్వు ఎలా తట్టుకోగలవని అమ్మ చెప్పారని జాన్వీ చెప్పుకొచ్చారు.అమ్మ ఆ విషయంలో ఎప్పుడూ కంగారు పడుతుండేదని జాన్వీ కపూర్ కామెంట్లు చేశారు.తాజాగా విడుదలైన గుడ్ లక్ జెర్రీ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube