శ్రీదేవి డ్రామా కంపెనీకి 'సన్నీ లియోన్'.. సుడిగాలి సుధీర్ రచ్చ!

తెలుగు బుల్లితెరపై తన టాలెంట్ ను నిరూపించుకొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఆర్టిస్టు సుడిగాలి సుధీర్. సుదీర్ఘకాలంగా బుల్లితెరపై సందడి చేస్తున్న జబర్దస్త్ షో తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.

 Sridevi Drama Company Latest Promo Sunny Leone Details, Sri Devi Drama Company,-TeluguStop.com

ఇక అందులో కమెడియన్ గా అడుగుపెట్టి అతి తక్కువ సమయంలో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు.

అప్పటి నుంచి వెనుతిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.

కెరీర్ మొదట్లో సుధీర్ మ్యాజిక్ లు చేసేవాడు.అలా పలు షోలలో మ్యాజిక్ లు చేసి జబర్దస్త్ దృష్టిలో పడ్డాడు.

ఇక జబర్దస్త్ తో సుధీర్ కెరీర్ మొత్తం మారిపోయింది.అలా జబర్దస్త్ లో యాంకర్ రష్మీ తో లవ్ ట్రాక్ నడుపుతూ అందరి దృష్టిలో పడ్డాడు.

అలా ఈ షో లో వీరిద్దరి మధ్య జరిగే సంభాషణ బాగా సందడిగా ఉంటుంది.

ఇక జబర్దస్త్ షో ద్వారా వెండితెరపై అవకాశం అందుకున్నాడు.

పలు సినిమాలలో సహాయ పాత్రల్లోనూ నటించాడు.అంతేకాకుండా హీరోగా కూడా పలు సినిమాలలో నటించి తనకంటూ మంచి పేరు సంపాదించుకున్నాడు.

మళ్లీ బుల్లి తెర పై కమెడియన్ గానే కాకుండా యాంకర్ గా కూడా అడుగు పెట్టాడు.

గతంలో పోవే పోరా అనే షో తో యాంకర్ గా పరిచయమై అందులో మంచి మార్కులు సంపాదించుకున్నాడు.ఇక ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమైన ఢీ షో లో టీం లీడర్ గా చేశాడు.ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా యాంకర్ గా చేసి మరింత గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

ఇక ప్రస్తుతం వెండితెరపై, బుల్లితెరపై ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాడు.సుధీర్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు.తనకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటాడు.ఈయనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

నిజానికి చాలామంది ఈటీవీ లో ప్రసారమయ్యే పలు షోలను సుధీర్ కోసమే చూస్తుంటారు.ఇక సుధీర్ అంటే ప్రస్తుతం ఒక స్టార్ హీరోకున్నంత ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.ఇదిలా ఉంటే సుధీర్ కు అమ్మాయిల వీక్నెస్ ఉంటుందని ఆయన షో చూసే ప్రతి ఒక్కరికి తెలుసు.అలా ఏ షోలో నైనా సుధీర్ ను అమ్మాయిల విషయంలో బాగా ఆట పట్టిస్తుంటారు.

ఇదిలా ఉంటే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.అందులో ఓ కమెడియన్ సన్నీలియోన్ వచ్చిందని అనేసరికి వెంటనే సుడిగాలి సుధీర్ రచ్చ రచ్చ చేస్తాడు.

గ్లాస్ పాలు రెడీ చేయండి అంటూ డబల్ మీనింగ్ డైలాగ్ కొడతాడు.ఆ తర్వాత సన్నీ లియోన్ హుస్సేన్ సాగర్ లో పడిందని అనటంతో.

అరే ఇప్పుడు సన్నీలియోన్ ను కాపాడేది ఎవరు అంటూ బాగా రచ్చ రచ్చ చేస్తాడు.ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట్లో వైరల్ గా మారగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube