శ్రీదేవి కూతురు అర్జున్ రెడ్డి ఛాన్స్ మిస్ చేసుకోడానికి కారణం ఎవరో తెలుసా.? ఆయన చెప్పబట్టే.!       2018-07-03   01:18:40  IST  Raghu V

సందీప్ రెడ్డి వంగా…కొన్ని నెలల క్రితం వరకూ ఈ పేరు ,ఈ మనిషి ఎవరికీ తెలీదు.కానీ ఇప్పుడు ఈ పేరు తలవని వారుండరు..మూసధోరణితో పోతున్న తెలుగు సినిమా చెంపలు పగలకొట్టి తన స్టైల్లో సినిమా తీసి సత్తా చాటాడు..బోల్డ్ సినిమా అన్నారు,బూతు సినిమా అన్నారు ఎన్ని విమర్శలొచ్చినా సినిమా మాత్రం సూపర్ హిట్..నైట్ కి నైటే స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా ప్రస్తుతం వేరే భాషల్లో కూడా రీమేక్ అవుతుంది.

ఈ సినిమా హిందీ లో కూడా రీమేక్ అవుతుంది. షాహిద్ కపూర్ – తార సుటారియా జంటగా నటిస్తున్న బాలీవుడ్ అర్జున్ రెడ్డికి ఒరిజినల్ దర్శకుడు సందీప్ వంగనే దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గా సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఈ కథలో రొమాన్స్ కి ఏ రేంజ్ లో ప్లేస్ ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ లో అయితే ఆ డోస్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.

అయితే ఈ సినిమా హిందీ రీమేక్ లో మొదటగా జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా పెడదాం అనుకున్నారు. అయితే ఆమె మెంటర్ గా ఉన్న దర్శకుడు నిర్మాత కరణ్ జోహార్ అందుకు ఒప్పుకోలేదట.కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి రొమాంటిక్ సీన్స్ లలో ఎక్కువగా నటించకూడదని చెప్పి మరాఠి లో హిట్టయిన సైరత్ రీమేక్.. ధఢఖ్ సినిమాకు షిఫ్ట్ చేశారు. ఆ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది.