అతిలోకసుందరి శ్రీదేవి గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

అలనాటి తార అతిలోకసుందరి శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే.తన నటనతోనే కాకుండా తన అందంతో కూడా ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.

 Versatile Actress Sridevi Birth Anniversary Special Story,  Sridevi , Sridevi Bi-TeluguStop.com

తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.దాదాపు 100 సినిమాలకు పైగా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

ఇదిలా ఉంటే శ్రీదేవి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఈరోజు శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఈమె 1963లో ఆగస్టు 13న తమిళనాడులో జన్మించింది.ఇక సినీ ఇండస్ట్రీకి బాలనటిగా పరిచయమైన శ్రీదేవి చిన్న వయసులోనే ఎన్నో సినిమాలలో నటించింది.1976 లో కమల్ హాసన్, రజినీకాంత్ నటించిన సినిమాలో నటించి మంచి పేరు సంపాదించుకుంది.ఆ తర్వాత ఏడాది బంగారక్క అనే సినిమాలో హీరోయిన్ గా పరిచయమైంది.

అలా పదహారేళ్ళ వయసు, ఎర్ర గులాబీలు, వేటగాడు ఎన్నో సినిమాలలో నటించింది.ఒక ఏడాదికి 11, 12 సినిమాలలో కూడా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Telugu Bangarakka, Bath Tub, Boney Kapoor, Dubai Hotel, Erra Gulabilu, Jhanvi Ka

ఈమెతో కలిసి ఎన్నో సినిమాలలో నటించిన బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ సోదరుడు బోని కపూర్ ను 1996 జూన్ 2న వివాహం చేసుకుంది.ఇక వీరికి జాన్వీ కపూర్, ఖుషి కపూర్ అనే ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు.ఇక వీరిని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఎన్నో కలలు కనింది.కాని తన కోరిక చూడకు ముందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్ళింది.మొత్తానికి జాన్వీ కపూర్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కు ఉన్న రేంజ్ ను అందుకుంది.అంతేకాకుండా ఖుషి కపూర్ కూడా త్వరలోనే హీరోయిన్ గా పరిచయం కానుంది.

Telugu Bangarakka, Bath Tub, Boney Kapoor, Dubai Hotel, Erra Gulabilu, Jhanvi Ka

ఈమె 2018 ఫిబ్రవరి 24 ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది.దుబాయ్ లో ఓ హోటల్లో బాత్ టబ్ లోనే చనిపోయింది.ఇక విషయం తెలిసిన వెంటనే ఎంతోమంది అభిమానులు మూగపోయారు.అంతేకాకుండా ఇండస్ట్రీలు శోకసంద్రంలో మునిగిపోయింది.

ఇక ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో తన నటనను, అందాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube