న్యాచురల్ స్టార్ నాని రిలీజ్ చేసిన శ్రీ విష్ణు ‘భళా తందనాన’ టీజర్

విలక్షణ కథలతో తన మార్క్ చూపెడుతున్న యంగ్ హీరో శ్రీ విష్ణు ప్రస్తుతం ‘భళా తందనాన‘ అనే కమర్షియల్ ఎంటర్‌టైనర్ లో న‌టిస్తున్నారు.బాణం ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కేథ‌రిన్ థ్రెసా హీరోయిన్.

 Sri Vishnu 'bhala Thandanana' Teaser Released By Natural Star Nani, Bhala Thandanana, Tollywood , Nani , Sri Vishnu, Catherine Theresa, Ramachandra Raju-TeluguStop.com

ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది.ఇప్ప‌టికే ఫస్ట్ లుక్ పోస్టర్, మ్యూజికల్ ప్రమోషన్స్‌తో సినిమా మీద పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి.

విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.నేడు న్యాచురల్ స్టార్ నాని ఈ మూవీ టీజర్ విడుదల‌చేశారు.

 Sri Vishnu 'Bhala Thandanana' Teaser Released By Natural Star Nani, Bhala Thandanana, Tollywood , Nani , Sri Vishnu, Catherine Theresa, Ramachandra Raju-న్యాచురల్ స్టార్ నాని రిలీజ్ చేసిన శ్రీ విష్ణు ‘భళా తందనాన’ టీజర్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

‘రాక్షసున్ని చంపడానికి దేవుడు కూడా అవతారాలెత్తాలి.నేను మామూలు మనిషిని’ అంటూ శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్‌తో టీజర్ మొద‌లైంది.ఇక శ్రీవిష్ణు సాఫ్ట్ రోల్‌లో కనిపించగా.కేథరిన్ థ్రెస్సా మాత్రం పొగరుగా కనిపించారు.

నీ దారిలో నువ్వు.నా దారిలో నేను.

ఇద్దరి లక్ష్యం ఒకటే అనే డైలాగ్‌తో హీరో హీరోయిన్ల ప్రయాణం, లక్ష్యం ఏంటో చెప్పేశారు.యాక్షన్ సీక్వెన్స్, శ్రీ విష్ణు నటన ప్రత్యేకంగా నిలిచింది.

ఇక రాజకీయ నాయకులను ప్రశ్నిస్తూ ముగిసిన టీజర్ అందరినీ మెప్పించేలా ఉంది.టీజర్‌లోని డైలాగ్స్ సినిమా కథ ఎలా ఉండబోతోంది అనేది చెప్పేశాయి.

డైలాగ్సే సినిమాకు మేజర్ హైలెట్ అని తెలుస్తోంది.థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమాను పక్కా కమర్షియల్‌గా తెరకెక్కించారు దర్శకులు చైతన్య దంతులూరి.

ఇక ఈ టీజర్ మొత్తంలో శ్రీవిష్ణు తన నటనతో అందరినీ మెప్పించారు.నటనలోని వేరియేషన్స్ చక్కగా చూపించారు.

కేథరిన్ ఈ రోల్‌కు పర్ఫెక్ట్ అనిపించేలా నటించారు.శ్రీనివాస్ రెడ్డి కామెడీ, కేజీయఫ్ ఫేమ్ రామచంద్ర రాజు విలనిజం బాగా కుదిరాయి.

మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు అందిస్తుండ‌గా.సురేష్ రగుతు కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.వారాహి చలనచిత్రం బ్యానర్ నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.టీజర్‌తో సినిమా మీద అంచనాలు పెంచేశారు.

పాపులర్ ప్రొడక్షన్ హౌస్ వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.శ్రీకాంత్ విస్సా రచయితగా, మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా, గంధి నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్‌గా, పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు.

నటీనటులు:

శ్రీ విష్ణు, కేథరిన్ థ్రెసా, రామచంద్ర రాజు

సాంకేతిక బృందం

దర్శకుడు: చైతన్య దంతులూరి,నిర్మాత: రజనీ కొర్రపాటి,సమర్పణ: సాయి కొర్రపాటి,బ్యానర్: వారాహి చలన చిత్రం,సంగీతం: మణిశర్మ ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్,సినిమాటోగ్రఫర్: సురేష్ రగుతు,యాక్షన్ కొరియోగ్రఫర్: పీటర్ హెయిన్,ఆర్ట్ డైరెక్టర్: గాంధి నడికుడికర్ రచయిత : శ్రీకాంత్ విస్సా,పీఆర్ఓ : వంశీ-శేఖర్

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube