మరో విభిన్న కథతో రాబోతున్న శ్రీవిష్ణు

టాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు శ్రీవిష్ణు.రెగ్యులర్ హీరోలకి భిన్నంగా కంటెంట్ బేస్ కథలని నమ్ముకుంటూ తక్కువ బడ్జెట్ తో కొత్త దర్శకులతో ఈ యువ హీరో ఎక్కువగా సినిమాలు చేస్తున్నాడు.

 Sri Vishnu Bhala Tandanana Shoot Begins-TeluguStop.com

అలాగే సినిమా నిర్మాతలుగా మారుదామని ఇండస్ట్రీలోకి వచ్చే వారు కూడా ముందుగా శ్రీవిష్ణుతోనే సినిమా చేయాలని అనుకుంటున్నారు.అతనితో తక్కువ బడ్జెట్ తో సినిమా అయిపోవడంతో పాటు పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి వస్తుందని మినిమమ్ గ్యారెంటీ ఉండటంతో అతన్ని నమ్ముకున్తున్నారు.

రీసెంట్ గా గాలి సంపత్ అనే సినిమాతో శ్రీవిష్ణు ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ కొడుకుగా, అతని యాక్టింగ్ పిచ్చితో ఇబ్బందులు పడే వాడిగా, అలాగే తండ్రి కోసం ఏమైనా చేసే కొడుకుగా భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు.

 Sri Vishnu Bhala Tandanana Shoot Begins-మరో విభిన్న కథతో రాబోతున్న శ్రీవిష్ణు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే శ్రీవిష్ణు సినిమాల ద్వారా చాలా మంది టాలెంటెడ్ దర్శకులు టాలీవుడ్ కి పరిచయం అయ్యారు.వివేక్ ఆత్రేయ కూడా శ్రీవిష్ణుతో ప్రయోగాత్మక సినిమా చేసి ఇప్పుడు నానితో సినిమా చేసే అవకాశం సొంతం చేసుకున్నాడు.

కెరియర్ లో భిన్నమైన కథలు, పాత్రలు చేయాలని డిసైడ్ అయిన ఈ కుర్ర హీరో మరో ప్రయోగాత్మక కథకి ఒకే చెప్పాడు.అప్పుడెప్పుడో నారారోహిత్ బాణం సినిమాతో మంచి విషయం ఉన్న దర్శకుడు అనిపించుకున్న చైతన్య దంతులూరి దర్శకత్వంలో భళా తందనాన అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభించారు.ఈ సినిమాలో శ్రీవిష్ణుకి జోడీగా కేథరీన్ నటిస్తూ ఉండగా కేజీఎఫ్ విలన్ రామ్ చంద్రరాజు ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు