నిరసన రోడ్డుపై శ్రీ రెడ్డి నగ్న ప్రదర్శన   Sri Reddy’s Nude Protest Against MAA     2018-04-07   09:16:46  IST  Sainath G

నటి శ్రీ రెడ్టి వింతలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. తెలుగు అమ్మాయి కావడంతో తనకి సినిమాల్లో అవకాశాలు ఇవ్వడం లేదంటూ, టాలెంట్ ని తొక్కెస్తున్నారంటూ గత కొన్నివారాలుగా ఎక్కడపడితే అక్కడే కనిపిస్తున్న శ్రీ రెడ్డి, చాలామంది సినీ ప్రముఖులపై సంచలనాత్మక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, దర్శకుడు శేఖర్ కమ్ముల అవకాశాల ఆశ చూపిస్తూ అమ్మాయిలని వాడుకుంటున్నారని శ్రీ రెడ్డి కామెంట్ చేయడం, ఆ తరువాత శేఖర్ కమ్ముల ఆ ఆరోపణలు పచ్చి అబద్ధాలు అంటూ ఆగ్రహజ్వాలలు వ్యక్తం చేయడం మీరు చూసారు‌.

--> ఇక శ్రీ రెడ్డి మరో సమస్య మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో సభ్యత్వం లేకపోవడం. తాను సభ్యత్వం కోసం అర్జీ పెట్టుకుంటున్నా, పదే పదే ప్రాధేయపడుతున్నా, తనకు కావాలనే మెంబర్ షిప్ ఇవ్వడం లేదని శ్రీ రెడ్డి వాదన. అయినా, తనకు సభ్యత్వం దక్కలేదు.

దాంతో ఈరోజు ఏకంగా ఫిలిం చాంబర్ ఎదుట ఇదిగోండి ఇలా MAA విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ ఇలా నగ్న ప్రదర్శన చేసింది శ్రీ రెడ్డి. ఫిలింనగర్ ఒక్కసారిగా ఈ వింత చేష్టకు ఉలిక్కిపడింది. సమయానికి పోలిసులు అక్కడికి చేరుకోని ఈ వివాదస్పద నటిని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.